Begin typing your search above and press return to search.

డిసెంబర్ 31న సిటీలో పోలీసుల రూల్స్ ఇవే

By:  Tupaki Desk   |   18 Dec 2018 1:30 AM GMT
డిసెంబర్ 31న సిటీలో పోలీసుల రూల్స్ ఇవే
X
నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుడా, జీరో యాక్సిడెంట్ డేగా జరుపుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. సైబరాబాద్ పరిధిలోని స్టార్ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫాంహౌసులు, రిసార్టుల యాజమాన్యాలతో ఆయన సమావేశమయ్యారు. సైబరాబాద్ పరిధిలో గతేడాది పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలవల్ల ఎలాంటి ప్రమాదాలు జరగలేదని సజ్జనార్ గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.

మాదాపూర్ జోన్లో ఎక్కువగా స్టార్ హోటళ్లు, శంషాబాద్, బాలానగర్ జోన్ల పరిధిలో ఎక్కువగా ఫాంహౌసులు, రిసార్టులు ఉండటం.. వాటిల్లో ఇటీవల కొన్నిచోట్ల అసాంఘిక కార్యకలాపాలు జరగడం తమ దృష్టికి వచ్చిందని సీపీ అన్నారు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. ప్రమాదాల నివారణకు మీడియా కూడా సహకరించాలన్నారు.

డిసెంబర్ 31న ఇవీ పోలీసుల రూల్స్:

• ఈవెంట్ పర్మిషన్లకు సంబంధించి వారం ముందు అనుమతులు తీసుకోవాలి.
• దీనికి సంబంధించి http://eservices.cyberabadpolice.in లింక్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి.
• న్యూ ఇయర్ వేడుకలు రాత్రి 8 గంటల నుంచి ఒంటిగంట వరకే జరుపుకోవాలి.
• పాస్ ఉన్నవారినే ఈవెంట్లకు అనుమతించాలి.
• డీజేలకు పర్మిషన్ లేదు.
• గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం పేకాట ఆడేవారిపై కఠిన చర్యలు.
• డ్రగ్స్, హుక్కా సేవించడం నిషేధం.
• రేవ్ పార్టీలకు అనుమతి లేదు.
• ఈవెంట్లలో అగ్ని ప్రమాదాలు జరిగితే నిర్వాహకులదే బాధ్యత.
• రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడానికి వీల్లేదు.
• ఈవెంట్ మేనేజర్లు అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకోవాలి.
• అర్థనగ్న చిత్రాలతో హోర్డింగులు పెట్టొద్దు.
• న్యూ ఇయర్ వేడుకల నిర్వాహకులు కచ్చితంగా సమయపాలన పాటించాలి.
• ఎక్కువగా తాగిన వారిని క్యాబుల్లో ఇంటికి పంపే బాధ్యత ఈవెంట్ యాజమాన్యానిదే.
• మందుకొట్టి బండి నడిపితే వెహికిల్ సీజ్.
• డిసెంబర్ 31 రాత్రి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పది స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలు.
• స్పీడ్ లేజర్ గన్ తో వాహనాల అతివేగానికి చెక్.
• వేడుకల్లో తుపాకులు, పిస్టళ్ల లాంటి ఆయుధాలకు నో పర్మిషన్.
• అన్ని వేడుకలను వీడియో తీసి పోలీసులకు రెండు రోజుల్లో అందజేయాలి.
• ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 11 నుంచి 5 గంటల వరకు ఆంక్షలు.
• ఎయిర్ పోర్టుకి వెళ్ళేవారికి మాత్రమే మినహాయింపు.
• 31 రాత్రి 11 గంటల నుంచి పొద్దున 5 వరకు అన్ని ఫ్లయ్ ఓవర్ల మూసివేత.