Begin typing your search above and press return to search.
ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా! :
By: Tupaki Desk | 5 Oct 2021 2:04 PM ISTసైబర్ నేరాలను అరికట్టేందుకు అవగాహన కల్పించడంలో భాగంగా మీమ్స్ తయారు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ట్రెండ్ కు తగ్గట్టుగా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు. కొన్ని మీమ్స్ అయితే, మీమర్స్ చేసే వాటికి దీటుగా ఉంటున్నాయి. బహుశా మీమ్స్ చేసేవారిని ఇందుకోసం నియమించుకున్నారా అనే సందేహం కూడా రాకమానదు. తాజాగా సైబర్ నేరంపై పోలీసులు రూపొందించిన మీమ్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.
ఫేస్ బుక్ లో ఎన్నో నకిలీ అకౌంట్లతో నేరాలు జరిపేందుకు దుండగులు ఎప్పుడూ పొంచి ఉంటారు. అమ్మాయిల పేరుతో నకిలీ అకౌంట్‌లు క్రియేట్ చేసి యువకులకు గాలం వేస్తుంటారు. చాటింగ్ లతో వలపువల విసిరి బుట్టలో వేస్తుంటారు. చివరికి కట్టుకథలు చెప్పి అందినకాడికి దోచుకోవడం లాంటి నేరాలు బోలెడు వెలుగులోకి వచ్చాయి. ఆఖరికి తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు అవతలి వ్యక్తి అమ్మాయి కాదు. అబ్బాయి అని తెలుసుకొని అవాక్కవుతుంటారు. ఫేస్ బుక్, ఫోన్లలో ఇంటర్నెట్ వచ్చిన మొదట్లో ఈ తరహా నేరాలు బాగా జరిగేవి.
ఆ తర్వాత అవగాహన పెరిగి కాస్త తగ్గాయి మళ్లీ ఇలాంటి పుంజుకుంటుండడంతో పోలీసులు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు తాజాగా ట్విటర్‌లో ఫన్ పోస్ట్ ఒకటి చేశారు. మహేష్ బాబు అతడు సినిమాలోని ఓ ఫేమస్ డైలాగ్ మీమ్‌ను వాడేశారు. ‘ఒక అమ్మాయి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి తెగ ఛాటింగ్ చేస్తుంద’ని కొడుకు మురిసిపోతుంటే.. ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదు రా’ అంటూ మీమ్ చేశారు. దీనిద్వారా ఫేక్ ఫేస్ బుక్ ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సందేశం ఇచ్చారు. పనిలో పనిగా నటుడు బ్రహ్మాజీని సైతం ట్యాగ్ చేసేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్రహ్మాజీ, ఆ ట్వీట్‌ను రీట్వీట్ కూడా చేశారు. ఇక సోషల్ మీడియా వాడకంలో పోలీసులది డిఫరెంట్ పంథా. కరెక్ట్ టైమింగ్, రైమింగ్ తో ప్రజల్ని అప్రమత్తం చేయడం, అవగాహన కల్పించడం వాళ్ల విధిగా మారింది. ఈ క్రమంలో నవ్వులు పూయించే మీమ్స్‌ను సైతం వాడేస్తున్నారు.