Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే రజినిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు..ఎలా తప్పించుకొందంటే!
By: Tupaki Desk | 10 Sep 2020 5:30 AM GMTగుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు. అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి ఘరానా మోసం బారిన పడకుండా తప్పించుకున్నారు. భారీ మొత్తంలో రుణాలు ఇస్తామంటూ ఓ వ్యక్తి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినికి ఫోన్ చేశాడు. తాను సీఎం కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. సీఎం జగన్ మీతో మాట్లాడాలని చెప్పినట్లు ఎమ్మెల్యే రజనీని నమ్మించే ప్రయత్నం చేశాడు. మాటల్లోపెట్టి భారీగా రుణం ఇప్పిస్తానని మాయమాటలు నమ్మబలికాడు. అయితే, రుణం కావాలంటే ముందుగానే కొంత మొత్తం చెల్లించాలన్నాడు. దీనితో అనుమానం వచ్చిన ఎమ్మెల్యే రజిని.. అతని వివరాలు సేకరించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. విశాఖపట్నంకు చెందిన జగజ్జీవన్ అనే పేరుతో సీఎం కార్యాలయంలో ఎవరైనా ఉన్నారా అని ఎంక్వయిరీ చేశారు. అలాంటి పేరుతో ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఎమ్మెల్యే, చాకచక్యంగా వ్యవహరించారు. అతడితో ఫోన్‌లో మాట్లాడుతూనే డీజీపీతో పాటు గుంటూరు అర్బన్ ఎస్పీకి విషయాన్ని చేరవేశారు. తర్వాత, పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే , అదే వ్యక్తి ఇటీవలే కడప జిల్లా రాయచోటికి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ను కూడా డబ్బులు అడిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇకపోతే, నిందితుడిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు వెల్లడించారు.