Begin typing your search above and press return to search.

ఓయో రూమ్ బుక్ చేయబోయి రూ.3.08 లక్షలు పోగొట్టుకున్నాడు

By:  Tupaki Desk   |   9 April 2021 3:30 PM GMT
ఓయో రూమ్ బుక్ చేయబోయి రూ.3.08 లక్షలు పోగొట్టుకున్నాడు
X
సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఏ చిన్న అవకాశం లభించినా.. వదిలిపెట్టని పరిస్థితి. ఎన్ని అవకాశాలు ఉంటే.. అన్ని రకాలుగా మోసం చేస్తున్న వైనం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ మహానగరానికి చెందిన ఉమేశ్ అనే ఉద్యోగి అడ్డంగా బుక్ కావటమే కాదు.. లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకూ ఏం జరిగిందంటే.. ప్రైవేటు ఉద్యోగిగా వ్యవహరిస్తున్న ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇటీవల అతగాడు కరోనా పాజిటివ్ బారిన పడ్డాడు. చికిత్స తీసుకోగా అతడికి.. నెగిటివ్ వచ్చింది. తన కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో.. వారికి అనవసరమైన చికాకులు తలెత్తకూడాదన్న ఉద్దేశంతో ఓయో రూం తీసుకుందామని భావించాడు.

బుకింగ్ కోసం.. గూగుల్ లో సెర్చ్ చేశాడు. అయితే.. అది నకిలీదన్న విషయాన్ని గుర్తించని ఉమేశ్.. సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కుకున్నారు. రూం బుక్ ాచేయటానికి సహకారం అందిస్తామని నమ్మబలికి.. త్వరగా ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు వీలుగా.. తాము ఒక క్యూఆర్ కోడ్ ను పంపుతామని.. స్కాన్ చేయాలని కోరారు. రూం బుకింగ్ కోసం తమకు రూ.10 మాత్రమే ఇవ్వాలని చెప్పటంతో.. వెంటనే వారు చెప్పినట్లే చేశాడు.

ఇదే అదునుగా చేసుకొని.. అతడి ఫోన్లోని సమాచారాన్ని తస్కరించి.. అతడి బ్యాంకు ఖాతాలోని రూ.3.08 లక్షల మొత్తాన్ని ఖాళీ చేశారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించటం.. అప్పటికే అతని ఖాతా ఖాళీ కావటం జరిగిపోయింది. దీంతో.. తాను మోసపోయినట్లుగా గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాధారణంగా ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని అడిగినా.. మీరు మోసానికి దగ్గరగా ఉన్నట్లుగా గుర్తించాలి.

అంతేకాదు.. ఏదైనా ఫోన్ నెంబరు కావాలంటే.. గూగుల్ లో వెతికే కన్నా.. సదరు సంస్థకు చెందిన వెబ్ సైట్ లో కానీ.. లేదంటే.. వారు పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే.. మొదటికే మోసం ఖాయం. అంతేకాదు.. సదరు సంస్థ.. మొబైల్ యాప్ లేదంటే వారి అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలే కానీ.. గూగుల్ ను నమ్ముకుంటే అంతే సంగతులన్న విషయాన్ని పలువురు సైబర్ నిపుణులు చెబుతున్నారు.