Begin typing your search above and press return to search.
సైబర్ మోసగాళ్ళ పనిపట్టే ‘సైబర్ సేఫ్’
By: Tupaki Desk | 16 Jun 2021 11:30 PM GMTసైబర్ మాసాలు..ఇపుడు యావత్ సమాజాన్ని వణికించేస్తున్న మోసాల్లో అత్యంతాధునికమైనది. అమాయకులను చాలా స్మార్టుగా మోసాలు చేయటాన్ని సైబర్ మోసాలంటున్నారు. మన మొబైల్ కు ఫోన్ చేసి ఏదో కతలు చెప్పి ఓటీపీ చెప్పమని అడుగుతారు. ఓటీపీ గనుక చెప్పేస్తే ఇంకేముంది మన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బంతా హారతికర్పూరమే. మోసపోయినట్లు గుర్తించి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉపయోగం ఉండదు.
అయితే అదంతా గతం..ఇపుడు కేటుగాళ్ళ పనిబట్టేందుకు కేంద్రహోంశాఖ పరిధిలో సైబర్ సేఫ్ పేరుతో ఓ యాప్, ఓ పోర్టల్ పనిచేస్తోంది. ఈ యాప్ 2019లోనే మొదలైనప్పటికీ దీనికి పెద్దగా ప్రచారం రాలేదు. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన కారణంగా సైబర్ సేఫ్ కు దేశవ్యాప్తంగా విశేష ప్రచారం మొదలైంది. రాజస్ధాన్ కు చెందిన ఓ పెద్దాయన ఖాతాలో నుండి కేటుగాళ్ళు రు. 6.5 లక్షలు కొట్టేశారు. ఆ డబ్బుతో మోసగాళ్ళు 33 షావోమీ స్మార్ట్ ఫోన్టను ఫ్లిప్ కార్ట్ ద్వారా కొన్నారు.
తన ఖాతాలో డబ్బులు పోయిన విషయాన్ని గ్రహించిన ఆ పెద్దాయన సైబర్ సేఫ్ యాప్ కు ఫిర్యాదుచేశారు. ఇంకేముంది ఫిర్యాదు అందగానే పోలీసులు వెంటనే రంగంలోకి దిగేశారు. బాధితుడికి ఫోన్ చేసి వివరాలు తీసుకున్న పోలీసులు తమ యాప్ ద్వారా ఏమి జరిగిందో తెలుసుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి ఝార్ఖండ్ లో ఉన్నట్లు గుర్తించారు. లొకేషన్ ఆధారంగా నిందితుడి అడ్రస్ పట్టుకున్నారు. అడ్రస్ పై దాడిచేసి నలుగురిని అరెస్టుచేశారు.
అలాగే పెద్దాయన క్రెడిట్ కార్డు ఆధారంగా ఫ్లిప్ కార్టలో ఇచ్చిన డెలివరీ అడ్రస్సులను ట్రేస్ చేశారు. దాని ఆధారంగా మధ్యప్రదేశ్ లోని బలాఘాట్ అడ్రస్ పై దాడిచేసి మరికొందరిని అరెస్టుచేశారు. అందరినీ విచారించిన తర్వాత ముఠాలో 350 మంది ఉన్నట్లు గుర్తించారు. వీళ్ళ దగ్గర వెయ్యి సెల్ ఫోన్లున్నాయట. 100 బ్యాంకుల్లో ఖాతాలు పెట్టుకుని మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 18 రాష్ట్రాల్లో ముఠా నెట్ వర్క్ పనిచేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.
ముఠాలోని సభ్యులందరినీ అరెస్టు చేసి పెద్దాయనకు న్యాయం చేశారు. యాప్, పోర్టల్ ద్వారా గడచిన రెండేళ్ళల్లో 65 వేల ఫిర్యాదులొస్తే 55 వేల ఫిర్యాదులను పరిష్కరించారు. ఇలాంటి యాప్, పోర్టల్ కు విస్తృత ప్రచారం కల్పించాల్సిన కేంద్రప్రభుత్వం ఎందుకనో పట్టించుకోలేదు. ఎందుకంటే కొద్ది సంవత్సరాలుగా సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నారు. మోసం జరిగిన వెంటనే యాప్, పోర్టల్ కు ఫిర్యాదు చేస్తేనే ఉపయోగం ఉంటుంది. ఆలస్యం జరిగితే మాత్రం ఎవరు చేయగలిగేదేమీ ఉండదని అందరు గ్రహించాలి.