Begin typing your search above and press return to search.

కొత్త మోసం.. 'షాదీ ముబారక్' సొమ్ము స్వాహా

By:  Tupaki Desk   |   22 Aug 2020 11:00 PM IST
కొత్త మోసం.. షాదీ ముబారక్ సొమ్ము స్వాహా
X
కాదేది మోసానికి అనర్హం అన్నట్టుగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. బ్యాంకుల నుంచి డబ్బులను కాజేస్తూనే ఉన్నారు.

తాజాగా ‘షాదీ ముబారక్’ సొమ్మును కూడా సైబర్ నేరగాళ్లు కాజేశారు. వినియోగదారుడికి తెలియకుండా డబ్బులు గల్లంతయ్యాయి.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ బాధితుడు ఈ సంవత్సరం జనవరిలో తన కుమార్తెకు వివాహం జరిపించాడు. పేద కుటుంబం కావడంతో ‘షాదీ ముబారక్’కు దరఖాస్తు చేయగా.. ఫిబ్రవరి 22న మంజూరైంది. అధికారులు అందజేశారు. ఆ చెక్కును బాధితుడు బ్యాంకులో డిపాజిట్ చేయగా.. అప్పటికే ఆ డబ్బు ఎన్ క్యాష్ అయినట్టు చూపించింది. తమిళనాడులోని చెన్నై ఎస్బీఐ బ్రాంచ్ లో ఎవరో ఇదే చెక్కుతో డబ్బులు డ్రా తేసినట్టు తేలింది.

లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఆగిన బాధితుడు తాజాగా శుక్రవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.