Begin typing your search above and press return to search.

బిగ్ బాస్కెట్ కు​ షాకిచ్చిన సైబర్​ నేరగాళ్లు..కస్టమర్ల డాటా చోరీ..30 లక్షలకు బేరం

By:  Tupaki Desk   |   9 Nov 2020 8:50 AM GMT
బిగ్ బాస్కెట్ కు​ షాకిచ్చిన సైబర్​ నేరగాళ్లు..కస్టమర్ల డాటా చోరీ..30 లక్షలకు బేరం
X
ప్రముఖ ఈ కామర్స్​ సంస్థ బిగ్ బాస్కెట్ ​ కస్టమర్ల డాటా మొత్తం చోరీకి గురైంది. బిగ్ బాస్కెట్ ​ కస్టమర్ల అడ్రస్​, మొబైల్​ నంబర్లు, పుట్టినరోజు వివరాలు చోరీ చేసిన సైబర్​ నేరగాళ్లు ఈ వివరాలను వేలానికి పెట్టారు. సైబర్ నేరగాళ్లు బిగ్ బాస్కెట్ కు చెందిన 2 కోట్ల మంది యూజర్ల డేటాను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబల్​ ఈ విషయాన్ని బయటపెట్టింది. బిగ్ బాస్కెట్ కంపెనీ తమ యూజర్ల డేటా చోరీపై బెంగళూరులోని సైబర్ క్రైమ్ సెల్‌ కు ఫిర్యాదు చేసింది. దీనిపై సైబర్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక హ్యాకర్.. బిగ్ బాస్కెట్ కు చెందిన యూజర్ల డేటాను రూ.30 లక్షలకు డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. డార్క్ వెబ్‌ లో member_member అనే టేబుల్ పేరుతో ఉందని, ఇందులో సర్వర్ SQL ఫైల్ సైజు 15GB వరకు ఉండగా, 20 మిలియన్ల మంది యూజర్ల డేటా ఉండొచ్చునని Cyble తన బ్లాగు లో వెల్లడించింది.

బెంగళూరు చెందిన బిగ్ బాస్కెట్.. అలీబాబా గ్రూపు, మిరేయి అసెట్ నవెర్ ఏసియా గ్రోత్ ఫండ్, సీడీసీ గ్రూపు సహకారంతో ఈ సంస్థ ను ప్రారంభించింది. ఈ విషయంపై బిగ్​ బాస్కెట్​ సంస్థ స్పందిస్తూ తమ కస్టమర్ల ప్రైవసీ తమకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నది. వ్యక్తిగత వివరాలు చోరీకి గురైన విషయం నిజమేనని అంగీకరించింది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని పేర్కొన్నది. అయితే కస్టమర్ల డెబిట్ ​కార్డు, క్రెడిట్​ కార్డుల నంబర్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు చోరీకి గురికి కా లేదని పేర్కొన్నది.