Begin typing your search above and press return to search.

ట్రూకాలర్ డేటా చోరీ ..అమ్మకానికి సిద్ధం !

By:  Tupaki Desk   |   27 May 2020 5:15 AM GMT
ట్రూకాలర్ డేటా చోరీ ..అమ్మకానికి సిద్ధం !
X
మీరు ట్రూకాలర్ వాడుతున్నారా.. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రముఖ దిగ్గజ కాలర్ ఐడీ, స్పామ్ ప్రొటెక్షన్ యాప్ ట్రూకాలర్‌లో 4.75 కోట్ల మంది భారతీయ వినియోగదారుల డేటా లీకైందని సైబర్ సెక్యూరిటీ, ఆన్‌లైన్ ఇంటలిజెన్స్ సంస్థ సైబెల్ తెలిపింది. డేటా మొత్తం ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంచినట్లుగా ఓ ఇంటిలిజెంట్ సంస్థ గుర్తించింది. 2019 సంవత్సరానికి ముందు ఉన్నసమాచారాన్ని డార్క్‌ వెబ్ ‌లో పెట్టారని ఆ సంస్థ తెలిపింది. ఈ డేటా లో అందరి ఫోన్ నెంబర్లు ,స్త్రీ, పురుషుల వివరాలతో పాటు నగరం, మొబైల్ నెట్వర్క్ ,ఫేస్ బుక్ ఐడి ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది.

అయితే.. దీనిపై స్పందించిన ట్రూకాలర్ మాత్రం ఇవన్నీ కేవలం ఆరోపణలేనంటూ కొట్టి పడేసింది. మా సర్వర్లు, డేటాబేస్ పటిష్టంగా ఉన్నాయంటూ బదులిచ్చింది. కొందరు కావాలనే ట్రూకాలర్ పేరిట డేటా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. ఇదిలా వుంటే 2019 సంవత్సరంలోనూ ఇలాంటి ఆరోపణలు జోరుగా విన్పించాయి. అయితే అప్పుడు ఏలాంటి సమాచారం ట్రూకాలర్ నుంచి లీక్ కాలేదని తేలిందని గుర్తించేసింది.