Begin typing your search above and press return to search.
విశాఖలో అమ్మాయిలే టార్గెట్ గా సైబర్ కేటుగాళ్ల మోసాలు...ఏ విదంగా అంటే !
By: Tupaki Desk | 14 July 2021 10:30 AMప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి సాంకేతికత అభివృద్ధి చెందుతూనే పోతుంది. రోజుకో నూతన ఆవిష్కరణ జరుగుతూనే ఉంది. రోజుకో కొత్త టెక్నాలజీ వెలుగులోకి వస్తుండటంతో .. కొత్త టెక్నాలజీ తో పాటుగా సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయంలో సైబర్ నేరగాళ్లు కూడా అంతే వేగంగా అప్డేట్ అవుతున్నారు. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరాలకు చెక్ పెడుతున్నామని చెపుతున్న పోలీసులకు కొత్త సవాల్ విసురుస్తున్నారు నేరగాళ్లు.
బ్యాంకు వివరాలు అంటూ కాల్స్ రావడమే ఆలస్యం.. డబ్బులు కట్ అయిపోతున్నాయంటూ వచ్చే కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరిగిపోతుంది. మరోవైపు మీకు లాటరీ వచ్చిందంటూ ఫోన్ చేసి తీరా వచ్చాక పాలసీలు, డిపాజిట్లు చెల్లించాలి అంటూ డబ్బులు వసూలు చేసే ముఠాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇందులో చదువుకున్న వారు కూడా లేకపోలేదు. పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోట్లు కొట్టేస్తున్నారు. గత కొద్దిరోజులుగా విశాఖ నగరవాసులపై సైబర్ నేరగాళ్లు గురిపెట్టారు. రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా విశాఖంలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.
ప్రధానంగా మహిళలను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు నేరగాళ్లు. వ్యక్తిగత వివరాలు సేకరించి, వాటి ఆధారంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలాంటి పరిస్థితి ఎదురైతే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. పెరుగుతున్న సైబర్ నేరాలపై పోలీసులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉక్కు నగరంలో సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో విశాఖ నగరం జాతీయ స్థాయిలో సైబర్ మోసాలకు ఖిల్లాగా మారుతోంది.విశాఖలో ప్రతి లక్ష మందిలో ముగ్గురు.. సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. నగరంలో ప్రతి లక్ష మందిలో 141 మంది మహిళలు బాధితులుగా మారుతున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ స్పష్టం చేస్తోంది.
విశాఖలో ఒకే ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది. నేరాల సంఖ్య మాత్రం భారీగా పెరుగుతోంది. మరోవైపు విశాఖ నగర పరిధి కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్క సైబర్ క్రైమ్ స్టేషన్ సరిపోతుందా అన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది. ఒక్క కంప్లైంట్ వెళ్లిందంటే అది ట్రేస్ అవుతుందన్న గ్యారంటీ లేదు. దీంతో సైబర్ క్రైమ్ కేసుల్లో పురోగతి ఉండటం లేదు. విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జాబ్స్ పేరిట, బ్యాంక్ ల పేరిట.. చివరికి హనీట్రాప్ తోనూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.