Begin typing your search above and press return to search.

పోలీసుల ముసుగులో సైబర్​ చీటర్స్​.. భద్రంగా ఉండాలే!

By:  Tupaki Desk   |   23 Sep 2020 2:30 AM GMT
పోలీసుల ముసుగులో సైబర్​ చీటర్స్​.. భద్రంగా ఉండాలే!
X
రోజుకో కొత్తవేషంలో మోసం చేసే సైబర్​ చీటర్స్​ రీసెంట్​గా తమ పంథా మార్చారు. ఈ సారి ఏకంగా పోలీసుల ముసుగులో వచ్చారు. లక్షల రూపాయలు కొల్లగొట్టి దర్జాగా వెళ్లిపోతున్నారు. పోలీస్​ ఉన్నతాధికారులు, సీఐ, ఎస్​ఐల పేరుతో నకిలీ ఫేస్​బుక్​ ఐడీలు క్రియేట్​ చేసి వాటితో ఏకంగా పోలీసుల జేబులనే కొల్లగొడుతున్నారు. ఇటీవల కర్నూలు జిల్లా చెందిన ఎస్ఐ శ్రీనివాస్‌ పేరుతో సైబర్​ నేరగాడు నకిలీ ఫేస్​బుక్​ ప్రొఫైల్​ను క్రియేట్​ చేశాడు. ఇందుకోసం అతడు శ్రీనివాస్​ ఒరిజినల్​ ఫేస్​బుక్​ ఖాతా నుంచే ఫొటోలు తీసుకొని నకిలీ ఐడీకి ప్రొఫైల్​ పిక్​గా పెట్టాడు. మరోవైపు శ్రీనివాస్​ ఒరిజినల్​ ఐడీలో ఉన్న స్నేహితులకే ఫ్రెండ్​ రిక్వెస్ట్​ పంపాడు. దీంతో వాళ్లు ఎస్సై మరో ఐడీ క్రియేట్​ చేశారేమోనని భావించి యాక్సెప్ట్​ చేశారు. అనంతరం తెలివిగా వాళ్లతో మెసెంజర్​లో చాటింగ్​ చేయడం మొదలు పెట్టాడు సైబర్​ నేరగాడు. తనకు అర్జెంటుగా డబ్బు అవసరముందని.. బ్యాంక్​లు బంద్​ ఉన్నాయని చెప్పడంతో తమ స్నేహితుడిగా భావించి వాళ్లు డబ్బులు పంపారు. తర్వతా శ్రీనివాస్​ కలిసినప్పడు వీళ్లు ఈ ప్రస్తావన తేవడంతో అసలు నిజం బయటపడింది. ఇటువంటి ఘటనలు నిత్యం కోకొల్లుగా జరుగున్నాయి.

ఇది మరో ఘటన
కర్నూల్​ జిల్లా నందివర్గం ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ క్రియేట్‌ చేశాడో మరో సైబర్‌ చీటర్‌. అనంతరం ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి.. పాణ్యం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ సుబ్బారెడ్డికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్ పంపాడు. నిజమేనని నమ్మేసిన హోంగార్డు ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేశాడు. అనంతరం అర్జెంట్‌గా రూ.10 లేదా రూ.50 వేలు కావాలంటూ ఎస్సై మెసేజ్​ పెట్టాడు. అయితే ఎందుకో డౌట్​ వచ్చిన హోంగార్డు.. నేరుగా ఎస్సైకి ఫోన్​ చేయడంతో అసలు నిజం బయటపడింది.

స్వాతి లక్రా పేరుతో చీటింగ్:
ఉమెన్ సేఫ్టీ అడిషనల్ డిజి స్వాతీ లక్రా పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలున్నట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. ఇటీవల ఆమె ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ పెట్టారు. ‘ నా పేరుతో సైబర్​ చీటర్లు ఫేక్​ ఐడీని క్రియేట్​ చేసి డబ్బులు అడుతున్నారు. దయచేసి ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరన్నా అలా అడిగితే వెంటనే స్క్రీన్​ షాట్స్​ తీసిపెట్టుకొని ఆ వివరాలతో పోలీసులకు ఫోన్​చేయండి’ అంటూ ఆమె ఇటీవల తన ఒరిజినల్​ ఫేస్​బుక్​లో ఓ పోస్ట్ ​చెప్పారు.

తెలుగు రాష్ట్రాలను టార్గెట్​ చేసిన సైబర్​ నేరగాళ్లు మొత్తం 50 మంది పోలీసుల పేరుతో నకిలీ ఐడీలు క్రియేట్​ చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసుల పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.