Begin typing your search above and press return to search.

ఐక్యరాజ్య సమితిపై సైబర్ దాడి..ఆ డేటా హ్యాక్

By:  Tupaki Desk   |   11 Sep 2021 12:43 PM GMT
ఐక్యరాజ్య సమితిపై సైబర్ దాడి..ఆ డేటా హ్యాక్
X
ప్రపంచ దేశాల చర్చలకు వేదికైన ఐక్యరాజ్య సమితి పై సైబర్ దాడి జరిగింది. హ్యాకర్లు యూనైటెడ్ స్టేట్స్ లోని కీలక డేటాను హ్యాక్ చేశారు. 2021 ఏడాదిలో ఏప్రిల్ నెలలో ఈ సైబర్ ఎటాక్ జరిగినట్టు గుర్తించారు. ఐక్యరాజ్య సమితిలోని సర్వర్లకు సంబంధించి సెక్యూరిటీ సిస్టమ్స్ ను హ్యాకర్లు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. అందులో పలు దేశాల మధ్య జరిగిన చర్చలతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించిన కీలక డేటా హ్యాక్‌ అయినట్టు సమాచారం.

ఐక్యరాజ‍్య సమితికి సంబంధించి పలు సెక్యూరిటీ సిస్టమ్స్‌ లోని డేటాను గుర్తు తెలియని హ్యాకర్లు హ్యక్‌ చేశారని యూఎన్ సెక్రటరీ జనరల్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ లో హ్యకింగ్‌ జరిగినట్టు గుర్తించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ సైబర్ దాడిపై విచారణ కొనసాగుతోందని స్టీపెన్ వెల్లడించారు. UN నెట్‌ వర్క్‌ ను యాక్సస్ చేసేందుకు హ్యాకర్లు అధునాతనమైన పద్ధతి వినియోగించినట్టు కనిపించడం లేదు. డార్క్ వెబ్‌ లో కొనుగోలు చేసిన UN ఉద్యోగికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్‌ వర్డ్‌ ద్వారా సైబర్ దాడికి పాల్పడి ఉండొచ్చునని భావిస్తున్నారు. ఏప్రిల్ 2021లో ఐక్యరాజ్యసమితి మౌలిక సదుపాయాలలో కొన్నింటి పై సైబర్ దాడి జరిగినట్టు గుర్తించామని స్టీపెన్ ఒక ప్రకటనలో వెల్లించారు.

ఐక్యరాజ్యసమితిపై సైబర్ దాడి లక్ష్యంగా గతంలోనూ అనేక దాడులకు సంబంధించి విషయాలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. హ్యాక్ అయిన డేటా.. UN యాజమాన్య ప్రాజెక్ట్ మేనేజ్‌ మెంట్ సాఫ్ట్‌ వేర్‌ లోని అకౌంటుకు చెందినవిగా గుర్తించారు. దీనిని ఉమోజా అని పిలుస్తారు. ఇక్కడి నుంచే హ్యాకర్లు UN నెట్‌ వర్క్‌ కు యాక్సస్ అయినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ సెక్యూరిటీ గుర్తించింది.UN సిస్టమ్‌ లకు హ్యాకర్లు యాక్సస్ చేసుకున్న మొదటి తేదీ ఏప్రిల్ 5 కాగా.. ఆగస్ట్ 7 నాటికి నెట్‌ వర్క్‌ లోకి ప్రవేశించినట్టు గుర్తించారు. ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలకు సంబంధించిన కీలక డేటాను స్టోర్ చేసి ఉంచుతారు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను హ్యకర్లు ఎలా ఛేధించారనేది అధికారులను షాకింగ్ గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ హ్యాకర్ల సైబర్ దాడిపై విచారణ కొనసాగుతోంది.

ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలకు సంబంధించిన కీలక సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను హ్యకర్లు ఎలా ఛేధించారనే దానిపై విచారణ కొనసాగుతోంది. యూన్‌కి సంబంధించిన ప్రొప్రైటరీ మేనేజ్‌ మెంట్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఉద్యోగికి చెందిన యూజర్‌ నేమ్‌, పాస్‌ వర్డ్‌ ఆధారంగా హ్యకర్లు యూఎన్‌ సిస్టమ్స్‌తో అనుసంధానమైనట్టు గుర్తించారు. యూఎన్‌కి సంబంధించిన సిస్టమ్స్‌తో యాక్సెస్‌ సాధించిన హ్యకర్లు ఏప్రిల్‌ 5 నుంచి ఆగస్టు 7 వరకు వరుసగా చొరబడినట్టు గుర్తించారు.