Begin typing your search above and press return to search.

భార‌త్‌ ను పీడిస్తున్న సైబ‌ర్ నేర‌గాళ్లు..2.9 కోట్ల ప్ర‌జ‌ల డేటా త‌స్క‌ర‌ణ‌!

By:  Tupaki Desk   |   23 May 2020 4:30 PM GMT
భార‌త్‌ ను పీడిస్తున్న సైబ‌ర్ నేర‌గాళ్లు..2.9 కోట్ల ప్ర‌జ‌ల డేటా త‌స్క‌ర‌ణ‌!
X
ఇప్ప‌టికే మ‌హ‌మ్మారి వైర‌స్‌తో భార‌త‌దేశం తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌వుతుంటే ఇప్పుడు క‌నిపించే వైర‌స్‌లాంటి వ్య‌క్తులు సైబర్ నేరగాళ్లు భార‌త‌దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్నారు. మ‌రోసారి మన దేశంపై ఆ నేర‌గాళ్లు విజృంభించారు. ఈ సంద‌ర్భంగా 2.9 కోట్ల భార‌త ప్ర‌జ‌ల డేటాను డార్క్ వెబ్‌సైట్‌లో పెట్టేశారు. ప్రముఖ జాబ్ వెబ్‌సైట్లలో ఉన్న డేటాను అంతా దొంగిలించినట్లు ఆన్‌లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబిల్ వెల్లడించింది.

గ‌తంలో ఇప్పుడు ఇంత పెద్ద‌సంఖ్య‌లో భార‌తీయుల డేటా త‌స్క‌ర‌ణ గురి కాలేదు. భారతదేశ చరిత్రలో మరో అతిపెద్ద సైబర్ క్రైమ్‌గా పేర్కొంటున్నారు. దాదాపు 2.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని డార్క్ వెబ్‌సైట్‌లో సైబ‌ర్ నేర‌గాళ్లు ఉంచారు. అయితే డేటా అంతా ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారిదేనని గుర్తించారు. వ్యక్తిగత వివరాలతో కూడిన రెజ్యూమ్స్‌ను ఉద్యోగాల‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అలాంటి వారి డేటాను దొంగిలించినట్లు సైబ‌ర్ విభాగం నిర్ధారించింది. అయితే ఇలాంటి వార్త‌లను సైబిల్ సంస్థ కొట్టిపారేసింది. ఇది సాధారణమైన విషయమేన‌ని చెబుతోంది.

ఈసారి విద్య, చిరునామా వంటి వ్యక్తిగత సమాచారం కూడా చోరీ అయిందని సైబల్ తెలిపింది. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, వర్క్ ఎక్స్ పీరియన్స్ తదితర వివరాలను కూడా సైబ‌ర్ నేర‌గాళ్లు బయటపెట్టార‌ని గుర్తించారు. ఇటీవల ఫేస్‌బుక్ హ్యాక్‌కు గురైన విషయాన్ని కూడా ఈ సంస్థే వెల్లడించింది.