Begin typing your search above and press return to search.
సీనియర్ స్టార్ హీరోయిన్ కు సైబర్ నేరగాళ్ల టోకరా!
By: Tupaki Desk | 9 March 2023 3:18 PM GMTటెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరాలు కూడా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈ సైబర్ నేరగాళ్ల బారినపడి తీవ్రంగా నష్టపోతున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును, క్రెడిట్ కార్డులను ఖాళీ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా సైబర్ నేరగాళ్లు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. వీరి మూలాలు ఎక్కడో వేరే రాష్ట్రాల్లో లేదా దేశాల్లో ఉంటున్నాయి. దీంతో వారిని పట్టుకోవడం ఇబ్బందిగా మారుతోంది.
తాజాగా సీనియర్ హీరోయిన్, ఒకప్పటి అగ్ర తార... నగ్మా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. పెద్ద మొత్తంలో నగదును కోల్పోయారు. తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్ ని క్లిక్ చేసిన నగ్మా రూ. లక్ష పోగొట్టుకున్నారు.
ఈ వ్యవహారం పూర్తి వివరాల్లోకెళ్తే... ఫిబ్రవరి 28న నగ్మా మొబైల్ ఫోన్ కు బ్యాంకు వాళ్లు పంపినట్లు ఓ మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న ఓ లింక్ ని నగ్మా ఓపెన్ చేశారు. ఈ క్రమంలో వెంటనే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్ ఉద్యోగిగా తనను తాను ఒక కేటుగాడు పరిచయం చేసుకున్నాడు. కేవైసీ అప్ డేట్ చేయాల్సి ఉందని నగ్మాకు చెప్పాడు. అయితే నగ్మా తన బ్యాంకు ఖాతా వివరాలేమీ అతడికి చెప్పలేదు. అయినప్పటికీ నగ్మా లింక్ ఓపెన్ చేయడంతో ఆమె ఆన్‌లైన్ బ్యాంకులోకి లాగిన్ అయిన సైబర్ నేరగాడు దాదాపు లక్ష రూపాయలు తన ఖాతాలోకి ట్రాన్సఫర్ చేసుకున్నాడు.
ఈ క్రమంలో సైబర్ నేరగాడు నగ్మా ఆన్‌లైన్ బ్యాంకు ఖాతాలోకి లాగిన్ అయ్యే క్రమంలో తన మొబైల్‌కి దాదాపు 20 సార్లు ఓటీపీలు వచ్చాయని నగ్మా తెలిపింది. కాగా పెద్ద మొత్తాన్ని నష్టపోకుండా రూ.లక్ష పోవడంతో నగ్మా బాధలోనూ సంతోషం వ్యక్తం చేశారు. నగ్మా మాదిరే సదరు బ్యాంకులో ఖాతాలు ఉన్న మరో 80 మంది కూడా ఇదే తరహాలో మోసపోయామని చెప్పడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా 1990వ దశకంలో పలు తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోయిన్ గా నగ్మా రాణించారు. ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రజినీకాంత్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించారు. తమిళ నటుడు శరత్ కుమార్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీలతో నగ్మా ప్రేమాయణాలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నగ్మా చెల్లెల్లు రోషిణి (చిరంజీవి సరసన మాస్టర్ హీరోయిన్), జ్యోతిక (హీరో సూర్య భార్య) కూడా నటీమణులే కావడం విశేషం.
ప్రస్తుతం నగ్మా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి బరిలోకి దిగిన నగ్మా ఓటమి పాలయ్యారు. జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.