Begin typing your search above and press return to search.

ఒక వైపు కోత .. మరోవైపు కొత్త ఓపెనింగ్స్ !

By:  Tupaki Desk   |   20 Feb 2021 1:30 AM GMT
ఒక వైపు కోత ..  మరోవైపు కొత్త ఓపెనింగ్స్ !
X
ప్రముఖ ఐటి దిగ్గజం కాగ్నిజెంట్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది భారీగా ఫ్రెషర్స్ ‌ను తీసుకోనున్నట్లు వెల్లడించింది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ఐటీ రంగంలో ఉద్యోగాలు తిరిగి పూర్వస్థితికి చేరుకుంటున్నాయి. కాగ్నిజెంట్ ఈ ఏడాది భారత్‌లో 23,000కు మించి ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నట్లు తెలిపింది. 2020 క్యాలెండర్ ఏడాదితో పోలిస్తే ఇది 35 శాతం అధికమని కంపెనీ సీఎండీ రాజేష్ నంబియార్ తెలిపారు. 2020 సంవత్సరంలో కంపెనీ 17,000 మందికి పైగా కొత్త వారిని తీసుకున్నట్లు తెలిపింది. ఇంటర్న్‌షిప్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.

భారత్‌లో సంస్థకు 2.04 లక్షల ఉద్యోగులు ఉన్నారు. అత్యంత ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్‌ మెంట్‌ విద్యార్థులతోపాటు ఇతర నిపుణుల నియామకాలను దేశంలో పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని సంస్థ సీఎండీ రాజేశ్‌ నంబియార్‌ తెలిపారు.

గతేడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్ల ద్వారా 17,000 మంది ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లను సంస్థలో చేర్చుకున్నట్టు వెల్లడించారు. నిపుణులను దక్కించుకోవడంలో కీలక కేంద్రాల్లో భారత్‌ ఒకటిగా ఉంటుందని అన్నారు. కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది జనవరి–మార్చిలో పెద్ద ఎత్తున నియామకాలు ఉంటాయని వివరించారు. 18 నెలల్లో 1.3 లక్షల మంది ఉద్యోగులకు డిజిటల్‌ నైపుణ్యాలను కల్పించామన్నారు. కాగ్నిజెంట్‌లో గతేడాది 5,000 మంది ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశారు. 2020లో 10,000 మందికి అవకాశం కల్పిస్తారు.

టాప్ పర్ఫార్మర్స్, డిజిటల్ స్కిల్డ్ ఎంప్లాయీస్ కోసం కంపెనీ ఇప్పటికే 30 మిలియన్ డాలర్ల రిటెన్షన్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. డిజిటల్ ప్రతిభకు తీవ్రమైన పోటీ ఉందని, కొన్ని రకాల నైపుణ్యాలకు సరఫరా-డిమాండ్ అసమతుల్యత ఉందన్నారు. కాగా, కాగ్నిజెంట్ ఆదాయం డిసెంబర్ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 2.3 శాతం పడిపోయి 4.18 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

ఇదిలా ఉంటే .. కరోనా నుండి ఇంకా పూర్తిగా కోలుకొని కొన్ని కంపెనీలు ఖర్చలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ కూడా ప్రపంచవ్యాప్తంగా 2వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్‌లోని మిడ్ ల్యాండ్స్ ఏరియా, స్లోవేకియా, భార‌త్, చైనా, బ్రెజిల్‌లోని ఉత్పాద‌క యూనిట్ల‌లో ఉద్యోగుల‌ను తొలగించే అవకాశముంది.

బ్రిట‌న్‌లో అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవ‌ర్. ప్ర‌స్తుతం జాగ్వార్ కంపెనీలో దాదాపు 40 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. 2024 నాటికి విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేస్తామని, 2025 నాటికి లగ్జరీ జాగ్వార్ బ్రాండ్ పూర్తి విద్యుత్ కార్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు సోమవారం తెలిపింది. అంతలోనే ఉద్యోగాల కోత నిర్ణయం తీసుకుంది.