Begin typing your search above and press return to search.
కస్టమ్స్ అధికారుల్లోనూ ‘దొంగలున్నారట'..ఏంచేశారంటే?
By: Tupaki Desk | 28 Nov 2020 10:34 AM GMTకస్టమ్స్ అధికారులు ... ఇతర దేశాల నుండి సరైన ఆధార పత్రాలు లేకుండా దొంగ సరకులను తెచ్చి అక్రమ రవాణా చేసే స్మగ్లర్ల భరతం పడుతుంటారు. కానీ , కస్టమ్స్ అధికారుల్లోనే దొంగలు ఉంటారు , నిజంగా దొంగ సరుకులు రవాణా చేసే వారికి పండగే. ఐనా కస్టమ్స్ అధికారుల్లో దొంగలు ఉంటారు అంటే నమ్మడానికి కొంచెం కష్టమే. కానీ నమ్మి తీరాల్సిందే. అసలైన గన్స్ ని బొమ్మ తుపాకుల్లా మార్క్ చేసి వాటి దిగుమతికి ఆరుగురు కస్టమ్స్ అధికారులు సాయపడ్డారన్న సమాచారం ఎయిర్ లైన్స్ వర్గాలను షాకింగ్ కి గురి చేసింది. ముంబై ఎయిర్ కార్గో కాంప్లెక్స్ లో పని చేసే వీరి నిర్వాకమిది. దీనిపై సీబీఐ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
బుల్లెట్స్ లేని అసలైన గన్స్ ని టాయ్ గన్స్ గా చూపి వాటిని అమ్మడానికి వీళ్ళు ప్రయత్నించారు. ఇది కేవలం అవినీతి కేసే కాదని, ఇందులో భద్రతా పరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అవినీతి నిరోధక చట్టం, ఆయుధ చట్టం తదితర చట్టాల కింద ఈ అధికారులపై కేసులు నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. 2016 లో ముంబైలోని బాలాజీ ఆటోమోటివ్ సొల్యూషన్స్ అనే సంస్థ 255 తుపాకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఈ అధికారుల సాయంతో వాటిని బొమ్మ తుపాకులుగా దాచి రహస్యంగా అమ్మడానికి ప్రయత్నించిందట.
ఈ సమాచారం తెలియడంతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సూచనపై సీబీఐ క్రిమినల్ కేసు పెట్టింది. మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ తో సహా మరో 5 గురు అధికారులపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. ఒకవైపు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో భారత జవాన్లు అమరులవుతుంటే మరోవైపు సాక్షాత్తు దేశంలోని కొన్ని ప్రైవేటు సంస్థలు విదేశాలనుంచి అక్రమంగా గన్స్ ని దిగుమతి చేసుకోవడం, దీనికి కస్టమ్స్ అధికారుల తోడ్పాటు సంచలనంగా మారింది.