Begin typing your search above and press return to search.

సిమ్ ప‌ని చేయ‌కుంటే కంపెనీల‌కు షాకే

By:  Tupaki Desk   |   15 Jun 2017 6:04 AM GMT
సిమ్ ప‌ని చేయ‌కుంటే కంపెనీల‌కు షాకే
X
టెలికం కంపెనీల‌కు భారీ షాక్‌ ను ఇచ్చింది టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌). విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ రోమింగ్ సిమ్ కార్డు కానీ గ్లోబ‌ల్ కార్డు ప్రొవైడ‌ర్లు కానీ సేవ‌లు అందించ‌టంలో తేడా వ‌స్తే.. కంపెనీలు భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై టెలికాం డిపార్ట్ మెంట్ కీల‌క ప్రతిపాద‌న‌లు చేసింది.

ఖాతాదారు ఎవ‌రైనా స‌రే విదేశీ ప్ర‌యాణాల్లో స‌ర్వీసు సేవ‌ల్లో అంత‌రాయం క‌లిగితే.. ప్రిపెయిడ్ కానీ పోస్ట్ పెయిడ్ కానీ కంపెనీలు ఖాతాదారుల‌కు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. వినియోగ‌దారుడి అంత‌ర్జాతీయ సిమ్‌కార్డు విఫ‌ల‌మైతే రూ.5వేల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంద‌ని సిఫార్సు చేసింది. జ‌రిమానాతో వ‌దిలిపెట్ట‌కుండా.. వినియోగ‌దారుడు చెల్లించిన ఫీజును సైతం 15 రోజుల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

ఫైన్ మాత్ర‌మే కాదు.. అంత‌ర్జాతీయ సిమ్ కార్డుల్ని అమ్మిన వాటిల్లో 10 శాతం కానీ ప‌ని చేయ‌కుంటే అలాంటి కంపెనీ అనుమ‌తిని సైతం ర‌ద్దు చేయొచ్చ‌ని రెగ్యులేట‌రీ సూచన చేసింది. అంతేకాదు.. అంత‌ర్జాతీయ సిమ్ కార్డు కొన్న వారి ఫిర్యాదుల ప‌రిష్కారానికి గ్రీవెన్స్ రెడ్రెస్స‌ల్ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని రెగ్యులేట‌ర్ సిఫార్సు చేసింది. ఈ ఏర్పాటుతో స‌మ‌స్య‌ల్నిత్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించే వీలుంద‌ని పేర్కొంది.

ఇదే స‌మ‌యంలో వినియోగ‌దారుడికి సైతం కొన్ని సూచ‌న‌లు చేసింది. అంత‌ర్జాతీయ సిమ్ కార్డుల కొనుగోలు డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే కొనుగోలు చేయాల‌ని పేర్కొంది. నెట్ బ్యాకింగ్‌.. క్రెడిట్‌.. డెబిట్ కార్డులు.. ఇ వాలెట్ ద్వారా కొనాల‌ని పేర్కొంది. ఇంట‌ర్నేష‌న‌ల్ రోమింగ్ ఇష్యూల‌పై చ‌ర్చ‌ల‌కు రియాక్ట్ కాని 23 కంపెనీల అనుమ‌తిని ర‌ద్దు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ట్రాయ్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. సేవ‌లు అందించే విష‌యంలో నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించే కంపెనీల‌కు ముకుతాడు వేయ‌టంతో పాటు.. వారిని దార్లోకి తీసుకురావ‌టానికి ఈ మాత్రం చ‌ర్య‌లు అవ‌స‌ర‌మే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/