Begin typing your search above and press return to search.
ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంట్ కట్
By: Tupaki Desk | 15 Dec 2021 6:54 AM GMTహైదరాబాద్ క్రికెట్ సంఘం అవినీతితో మకిలి పట్టిందని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అధ్యక్షుడు అజారుద్దీన్ పై కార్యవర్గం తిరుగుబాటుతో దేశంలో ప్రతిష్ట మసకబారింది. ఇక ఇక్కడ క్రికెట్ ప్రతిష్ట కూడా దిగజారిపోయింది. ఇక ఇప్పుడు మరో ఉపద్రవం చోటుచేసుకుంది.
ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి రూ.కోటికిపైగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు ఏడీఈ బాలకృష్ణ మంగళవారం తెలిపారు.
బిల్లులు చెల్లించకుండా కరెంట్ ను యథావిధిగా వాడుకోవడంతో శాఖ అధికారులు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి (హెచ్.సీఏ)పై గతంలో విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేశారు.
దీంతో హెచ్.సీఏ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విద్యుత్ శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇటీవల అధికారులు బకాయిల విషయమై హెచ్.సీఏకు నోటీసులు జారీ చేసినా చెల్లించకపోవడంతో సరఫరాను నిలిపివేశారు. దీంతో మైదానంలో చీకట్లు కమ్ముకున్నాయి.