Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ తీసుకోకుంటే కరెంట్ కట్.. జీతం బంద్
By: Tupaki Desk | 8 Dec 2021 2:30 PM GMTవ్యాక్సిన్ తీసుకోకుంటే ఇన్నాళ్లు రేషన్ కట్ చేశారు. ఇంకొన్ని చోట్ల పింఛన్ కట్ చేశారు. కానీ ఇప్పుడు ఇవేవీ చేసినా జనాలు పట్టించుకోవడం లేదని.. టీకాలు వేసుకోవడం లేదని భావించిన అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా కరెంట్ కట్ చేసి పడేశారు. కరోనా టీకా తీసుకోని ప్రజల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు అధికారులు.
దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది.
అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. సంగారెడ్డి జిల్లాలో అధికారులు మరో ముందడుగు వేసి కరోనా వ్యాక్సిన్ వేసుకోని వారి ఇళ్లకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామ జనాభా 4284 కాగా.. టీకాలు పొందేందుకు అర్హులు 2092 మంది ఉన్నారు. వీరిలో ఆదివారం వరకూ 1102మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకా వేసుకోని వారికి అయిదు రోజులుగా అధికారులు అనధికారికంగా రేషన్ పంపిణీని నిలిపివేశారు.
సోమవారం గ్రామంలో పర్యటించిన అదనపు కలెక్టర్ రాజర్షిసా అందరూ టీకా తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా? ఆరోగ్యం క్షీణించి మాకేమైనా అయితే ఎవరు దిక్కు? అంటూ కొందరు స్తానికులు ప్రశ్నించారు. దీంతో అధికారులు గ్రామంలో వ్యాక్సిన్ తీసుకోని నాలుగు ఇళ్లకు కరెంట్ సరఫరా నిలిపివేశారు. టీకాలు తీసుకునేందుకు సమ్మతించడంతో కరెంట్ సరఫరాను పునరుద్దరించారు.
తెలంగాణ రాష్ట్ర సహకరా అపెక్స్ బ్యాంకు (టెస్సాబ్) కరోనా నిబంధనలను తప్పనిసరి చేస్తోంది. కరోనా వ్యాక్సిన్లు తీసుకుంటేనే ఈనెల వేతనం వేస్తామని.. ఇప్పటివరకూ వేయించుకోని వారు వెంటనే వ్యాక్సిన్ పొంది సర్టిఫికెట్ సమర్పించాలని ఉద్యోగులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులందరికీ గత జూన్ 12న, తిరిగి సెప్టెంబరు 24న ప్రత్యేక శిబిరాలు నిర్వహించినా చాలా మంది తీసుకోలేదని తెలిపారు.