Begin typing your search above and press return to search.

ఔను.. మన పసుపు మహా అద్బుతమే

By:  Tupaki Desk   |   29 Sep 2021 2:30 AM GMT
ఔను.. మన పసుపు మహా అద్బుతమే
X
మనదేశంలో ప్రాచీన సంప్రదాయ ఔషధంగా పసుపు ఉంది. అతి శక్తిమంతమైన హెర్బల్ పౌడర్ పసుపు అని పెద్దలు చెప్తుంటారు. ఇక ఇప్పటికీ ఏదేని గాయం అయినా ఆ గాయంపై పసుపు పూస్తుండటం మనం చూడొచ్చు. ఆయుర్వేద నిపుణులు పసుపు ప్రాముఖ్యత గురించి గొప్పగా చెప్తుంటారు. సనాతన ఆయుర్వేదంలో పసుపు అత్యద్భుతమైన ఔషధమని పేర్కొంటారు. ఎన్నోరోగాలకు పసుపు సహజ సిద్ధమైన మందు అని చెప్తున్నారు. జర్నల్ ఆఫ్ జనరల్ వైరాలజీలో తాజాగా ప్రచురితమైన స్టడీ ప్రకారం.. పసుపులో ఉండే కర్కుమిన్ కొన్ని వైరస్‌లను నేచురల్‌గా తొలగిస్తుందని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండేందుకుగాను పసుపు తోడ్పడుతుంది. పసుపులోని కర్కుమిన్ ట్రాన్స్మిసిబుల్ గ్యాస్ట్రో ఎంటెరిస్ వైరస్‌ను ఇట్టే కంట్రోల్ చేయగలదని పరిశోధకులు తేల్చారు.

పసుపులోని కర్కుమిన్ వల్ల హ్యూమన్ బాడీ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాణాంతకమైన టీజీఈవీ వైరస్‌ను అది నివారిస్తుందని వివరించారు. కర్కుమిన్ హెపటైటిస్ బి, డెంగ్యూ, జికా వైరస్‌తో పాటు పలు వైరస్‌లను నిరోధిస్తుందని పేర్కొన్నారు. పసుపు క్యాన్సర్, మధుమేహం, హార్ట్ డిసీజెస్ ప్రమాదాలను తగ్గిస్తుంది. కేన్సర్ కణాలను తొలగించడంలో పసుపు తోడ్పడుతుంది. కేన్సర్ కణాలను తగ్గించడంలోనూ పసుపు సాయపడుతుంది. అయితే, పసుపు సహజ సిద్ధమైన ఔషధంగా ఉన్న సంగతి అందరికీ విదితమే.

ప్రాచీన కాలంలో మన పూర్వీకులు పసుపును మెడిసిన్‌గా యూజ్ చేసినట్లు చరిత్రకారులు కొందరు చెప్తున్నారు. చరిత్ర సైతం పూర్వం పసుపును మెడిసిన్‌గా వాడినట్లు ధ్రువీకరిస్తున్నది. మన దేశంలో నేటికీ ప్రతీ ఇంటిలో పసుపు అనేది కంపల్సరీ ఫుడ్ ఐటంగా ఉంటున్నది. భారతీయ పాకశాల అనగా వంట గదిలో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. కూరల్లో పుసుపును తప్పనిసరిగా వాడుతుంటారు. ఫుడ్ ఐటమ్స్ తయారీ అన్నిటిలో దాదాపుగా పసుపు వాడుతుంటారు. ఇక పసుపు పంటను సైతం రైతులు పండిస్తుంటారు. పసుపు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి కూడా అవుతుంటుంది.

ఈ నేపథ్యంలోనే ఆయుర్వేద నిపుణులు మాత్రమే కాదు ఇంగ్లిష్ మందులు వాడే ప్రజలు, ఇంగ్లిష్ మందులను సూచించే వైద్యులు సైతం పసుపును యూజ్ చేయడం మంచిదేనని పేర్కొంటున్నారు. ప్రతీ ఒక్కరు పసుపు యూసేజ్ గురించి తెలుసుకోవాలని చెప్తున్నారు. ఇకపోతే భారతీయ జీవనశైలిలో పసుపు అనేది భాగమై పోయిందని, అయితే, ఇటీవల కాలంలో పాశ్చాత్య ఫుడ్ కల్చర్ ఇండియన్స్ అవలంభించడం షురూ అయిందని, దాంతో పసుపు వాడకాన్ని క్రమంగా కొందరు తగ్గించేస్తున్నారని అంటున్నారు.

ఈ క్రమంలోనే పసుపు గురించి తెలియని వారు మాత్రమే అలా చేస్తారని, పసుపు సహజ సిద్ధమైన గుణాలు తెలిసిన ప్రతీ ఒక్కరు కంపల్సరీగా పసుపును తమ ఆహారంలో భాగం చేసుకుంటారని, ప్రతీ వంటకంలో వాడుతారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, మన దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ప్రజానీకం పసుపును వాడుతున్నట్టు కనిపిస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి వల్ల జనం సంప్రదాయ ఆహార పదార్థాలపైన కాన్సంట్రేట్ చేస్తున్నారని వివరిస్తున్నారు. సంప్రదాయ ఔషధం అయిన పసుపును తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు తమ హెల్త్‌పైన ఫుల్ కాన్సంట్రేషన్ పెడుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు.