Begin typing your search above and press return to search.
ఉద్యోగులు ఏం పాపం చేశారు మోడీ..?
By: Tupaki Desk | 18 March 2016 10:30 PM GMTచాలానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ.. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకొస్తారో లేదో కానీ.. దేశంలోని కోట్లాది మంది ఉద్యోగుల పొట్ట మీద మాత్రం భారీగా కొడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి మొన్న బడ్జెట్ లో ఉద్యోగులు జాగ్రత్తగా దాచుకున్న పీఎఫ్ మత్తమ్మీదా పడటం.. దీనిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేసి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పీఎఫ్ విషయంలో పన్ను పోటును మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తనలాంటి వ్యక్తి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని.. ఒక వర్గాన్ని దెబ్బేయాలని డిసైడ్ అయితే.. దాన్ని అడ్డుకొని ఆందోళన చేసి.. నిరసనలతో తన మాట చెల్లుబాటు కాకుండా చేసిన వేతన జీవుల మీద మోడీ పగబట్టినట్లుగా కనిపిస్తోంది. తాజాగా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయమే దీనికి నిదర్శనం. వేతన జీవులు కడుపు కట్టుకొని మరీ దాచుకునే పీపీఎఫ్ మీద ఇచ్చే వడ్డీ రేటును భారీగా తగ్గించి సామాన్యులకు.. మధ్యతరగతి ఉద్యోగులకు భారీ నిరాశను మిగిల్చారు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.. కిసాన్ వికాస పత్రం మీద ఇచ్చే వడ్డీ రేట్ల మీద భారీగా కోత పెడుతూ నిర్ణయాన్ని వెల్లడించారు. పీపీఎఫ్ మీద ఇప్పటివరకూ ఇస్తున్న 8.7 శాతం వడ్డీని 8.1 శాతంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. కేవీపీ వడ్డీ రేటును 8.7 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను సవరించాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా.. తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు తాజా వడ్డీరేట్లు అమల్లోకి ఉండనున్నాయి. కేంద్రం ప్రకటించిన వడ్డీ కోత నిర్ణయంపై ఉద్యోగుల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. రూపాయి రూపాయి ఖర్చు చేయకుండా దాచుకునే డబ్బు మీద ఇచ్చే వడ్డీ విషయంలోనూ కేంద్రానికి అంత కక్కుర్తి ఎందుకో..?