Begin typing your search above and press return to search.

ఈజీప్ట్ మమ్మీలకు సిటీ స్కానింగ్.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   24 Jun 2021 2:30 AM GMT
ఈజీప్ట్ మమ్మీలకు సిటీ స్కానింగ్.. ఎందుకంటే?
X
కొన్ని శతాబ్ధాల క్రితం ఈజిప్ట్ లో పాలించిన రాజులు చనిపోతే పెద్ద సమాధిని కట్టుకొని రసాయనాలు పూసుకొని బంగారం, నగలతో వారిని పెద్ద సమాధిలో దాచేసేవారు. తద్వారా వారికి పునర్జన్మ ప్రాప్తిస్తుందని నమ్మకం. వారి శవాలను ‘మమ్మీలు’ అంటారు. దానిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. మనం చూశాం కూడా. క్రీస్తుపూర్వం ఈజిప్ట్ రాజులను ఇలా పెద్దపెద్ద సమాధుల్లో నిక్షిప్తం చేశారు. అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.

తాజాగా పురాతన ఈజిప్ట్ మమ్మీలకు సిటీ స్కాన్ తీస్తున్నారు. ఒక పరిశోధన నిమిత్తం ఇలా చేస్తున్నారు. మమ్మీల వెనుక ఉన్న రహస్యాలను బయటపెట్టనున్నారు.ఈ క్రమంలోనే పురాతన ఈజిప్టు పూజారి మమ్మీని బెర్గామో సివిక్ ఆర్కియాలజికల్ మ్యూజియం నుంచి మిలన్ పోలోక్లినికో ఆస్పత్రికి తరలించి స్కానింగ్ తీశారు.దాదాపు 3000 ఏళ్ల క్రితం ఖననం చేసిన అతడి ఆచారాలు, జీవితం రహస్యాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ పరిశోధన చేస్తున్నట్టు తెలుస్తోంది.

పరిశోధకులు ఈ ఈజిప్ట్ పూజారి జీవితం, అతడి మరణాన్ని గురించి పరిశోధించనున్నారు. అతడి శరీరాన్ని మమ్మీ చేయడానికి ఏ రకమైన ఉత్పత్తులను ఉపయోగించారో తెలుసుకోనున్నారు. పురాతన వ్యాధులు, గాయాలను అధ్యయనం చేస్తున్నారు. క్యాన్సర్, ఆర్టిరియోస్క్లెరోసిస్ వ్యాధుల గురించి అధ్యయనం చేస్తున్నారు. వాటి రహస్యాలు వెలికి తీసేదిశగా ఈ స్కానింగ్ లు తీస్తున్నారు.