Begin typing your search above and press return to search.

వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి..చెన్నైకి బలమే బలహీనంగా మారిందా!

By:  Tupaki Desk   |   3 Oct 2020 12:30 PM GMT
వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి..చెన్నైకి బలమే బలహీనంగా మారిందా!
X
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ల్లో అత్యంత విజయవంతమైన జట్టు. అత్యధిక విజయాలు ట్రోఫీలు సాధించిన జట్టు అదే. ఆ జట్టుతో ఆట అంటే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. టీం ఇండియాను కెప్టెన్ గా అద్భుతంగా నడిపించిన ధోనీ చెన్నై బలం. తన వ్యూహాలతో జట్టుకు ఎన్నో విజయాలు చేకూర్చాడు. అయితే ఎప్పుడూ ఒకే కాలం నడవదుగా ఈ సీజన్లో చెన్నై గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దానికి కారణాలు బోలెడు. బ్యాటింగ్ లో ధోనీ మునుపటిలా జోరు చూపించడం లేదు. మంచి ఫినిషర్ గా పేరు పొందిన రైనా జట్టు లో లేకపోవడం ఆ జట్టును బాగా దెబ్బ తీసింది. ఐపీఎల్లో కోహ్లి , రోహిత్ శర్మ కంటే ముందే ఎన్నో రికార్డులు నెలకొల్పిన బాట్స్మెన్ రైనానే. అతడి గైర్హాజరీ జట్టు విజయాలను ప్రభావితం చేస్తోంది. బ్రేవో కూడా గాయాల కారణంగా జట్టు కు దూరం కావడం జట్టును బలహీనం చేసింది.

చెన్నై జట్టు కు డాడీ స్ జట్టుగా పేరుంది. దానికి కారణం ఆ జట్టులో అందరూ వయసు అయిపోయినోళ్ళు ఉండటమే కారణం. వారంతా ఫాంలో ఉండి గతంలో ఎన్నో విజయాలు అందించారు. కానీ ఇప్పుడు అదే ఆటగాళ్ళ వయసే జట్టు అపజయాలకు కారణం అవుతోంది. చెన్నై జట్టులో ఎవరూ ఫిట్టుగా కనిపించడంలేదు. మిగతా జట్లలో యువ ఆటగాళ్ళు ఫీల్డింగ్ లో అద్బుతాలు చేస్తుండగా.. చెన్నై ఆటగాళ్ళలో ఆ మెరుపులు కనిపించడం లేదు. పరుగులను ఆపలేకపోతున్నారు. క్యాచ్ లను జారవిడుస్తున్నారు. 2014 ఐపీఎల్ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడటం ఇదే తొలిసారి.

చెన్నై ఎక్కువగా బ్యాటింగ్ లో డుప్లెసిస్ పై ఆధార పడుతోంది. రాయుడు ఒక మ్యాచ్ గెలిపించినా మరో మ్యాచ్ ఆడలేదు. ఒక మ్యాచ్ లో విఫలం అయ్యాడు. ధోనీ చివర్లో వస్తూ ఆఖర్లో కాసిన్ని మెరుపులకే పరిమితం అవుతున్నాడు. ఇవి జట్టు అపజయాలకు కారణం అవుతున్నాయి. 'మిడిల్ ఓవర్లలో బంతిని హిట్ చేయడం నాకు కూడా కష్టం అయ్యింది.క్యాచ్‌ లు చేజార్చడం, నోబాల్స్ వేయడం వంటి తప్పిదాలు చేశాం. బౌలర్లు రెండు చెత్త ఓవర్లు వేశారు. లీగ్ మ్యాచ్‌ లు కాబట్టి సరి పోయింది. తర్వాతి మ్యాచ్‌‌ కు మా తప్పిదాలను సవరించుకుంటాం' అని హైదరాబాద్ తో మ్యాచ్ అనంతరం ధోనీ పేర్కొన్నాడు.