Begin typing your search above and press return to search.
హమ్మయ్య.. చెన్నై ఇంకొకటి..
By: Tupaki Desk | 26 Oct 2020 6:15 AM GMTఈ ఐపీఎల్ సీజన్లో ఎన్నడూ లేని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో అభిమానులు నిరాశపరిచింది. మూడు సార్లు ట్రోఫి, ఐదు సార్లు రన్నరప్ గా నిలిచిన జట్టు అనూహ్యంగా ఓటముల బాట పట్టింది. చెన్నై జట్టు ఆడిన తొలి పది మ్యాచ్‌లలో ఏకంగా ఏడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ఈ పరిస్థితుల్లో చెన్నైకి ఓ ఊరట విజయం లభించింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.కెప్టెన్ విరాట్ కోహ్లీ 43 బంతుల్లో ఒక ఫోరు, సిక్స్ సాయంతో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.డివిలియర్స్ 36 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్(22) పించ్ (15), మొయిన్ అలీ (1) విఫలం అయ్యారు. సీఎస్కే బౌలర్లలో శామ్ కరణ్(3/19), దీపక్ చాహర్(2/31) కట్టుదిట్టంగా బంతులేసి బెంగళూరు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. ఛేదనలో చెన్నై జట్టు 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ 65 (51 బంతులు) చక్కటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అంబటి రాయుడు 39 (27 బంతులు), డుప్లెసిస్ 25 (13 బంతులు), ధోనీ 19 పరుగులు చేసి మ్యాచ్ ముగించాడు.
200 సిక్సర్ల క్లబ్ లో విరాట్
ఈ మ్యాచ్‌లో కోహ్లి సిక్స్ కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 200వ సిక్సర్‌ను సాధించాడు.జడేజా వేసిన 17ఓవర్ మూడో బంతిని కోహ్లి సిక్స్ గా మలిచాడు. ఫలితంగా ఐపీఎల్‌లో రెండొందల సిక్సర్లు కొట్టిన జాబితాలో కోహ్లి కూడా చేరిపోయాడు. ఐపీఎల్‌లో రెండొందలు, అంతకంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టిన జాబితాలో క్రిస్ గేల్(335), ఏబీ డివిలియర్స్(231), ఎంఎస్ ధోని(216), రోహిత్ శర్మ(209) వరుస స్థానాల్లో ఉండగా, ఆ తర్వాత స్థానంలో కోహ్లి నిలిచాడు.