Begin typing your search above and press return to search.

గెలిచి నిలిచిన కోల్ కతా.. పంజాబ్, రాజస్థాన్ ఇంటికి

By:  Tupaki Desk   |   2 Nov 2020 1:30 AM GMT
గెలిచి నిలిచిన కోల్ కతా.. పంజాబ్, రాజస్థాన్ ఇంటికి
X
ఐపీఎల్లో భాగంగా ఆదివారం రెండు మ్యాచ్ లు జరుగగా మూడు జట్ల భవిష్యత్ తేలిపోయింది. ముందుగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఘోరంగా ఓడి పోయి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. చెన్నై టోర్నీలో ముందుగా వరుసగా మ్యాచ్ లు ఓడిపోగా ఆ జట్టు ఇంటికెళ్ళడం కన్ఫర్మ్ అయ్యాక మాత్రం వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ లో ఉన్న జట్లను ఇంటికి పంపే పని పెట్టుకుంది. కీలక మ్యాచ్ లో పంజాబ్ చేతులు ఎత్తి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరో మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ రేస్ లో ఉన్న కోల్ కతా, రాజస్థాన్ రాయల్స్ తల పడగా నైట్ రైడర్స్ రాయల్స్ పై 60 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగా ఉంచుకోగా రాజస్థాన్ నిష్క్రమణ కన్ఫర్మ్ అయ్యింది

రుతు రాజ్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ

చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 9 వికెట్లతో పంజాబ్‌ను చిత్తు ఓడించింది.టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు సాధించింది. దీపక్‌ హుడా (30 బంతుల్లో 62 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేఎల్‌ రాహుల్‌ (27 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్‌), మయాంక్‌ అగర్వాల్‌ (15 బంతుల్లో 26; 5 ఫోర్లు) రాణించారు. మన్ దీప్(14), గేల్‌ (12), పూరన్‌ (2) విఫలం అయ్యారు. చెన్నై బౌలర్ లుంగి ఇన్‌గిడి 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఛేదనలో చెన్నై 154 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఒక మాత్రమే కోల్పోయి విజయం అందుకుంది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రుతురాజ్‌ గైక్వాడ్‌ (49 బంతుల్లో 62 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా మూడో మ్యాచ్ లోనూ హ్యాట్రిక్‌ అర్ధ సెంచరీతో మెరిశాడు. డుప్లెసిస్‌ (34 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాయుడు (30; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. 18.5 ఓవర్లలోనే చెన్నై ఛేదన పూర్తి చేసింది.

మోర్గాన్ మోత.. కోల్ కతా రేసు లోనే

ఆదివారం రాత్రి మొదటకోల్ కతా - రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (0), నరైన్‌ (0), దినేశ్‌ కార్తీక్‌ (0) డకౌటైనా రైడర్స్ బ్యాట్స్ మెన్ సిక్సులతో మోత మోగించారు. ఫోర్ల కంటే సిక్సులే ఈజీ అన్నట్లుగా చెలరేగారు. ఇయాన్‌ మోర్గాన్‌ (35 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) శుభ్ మన్‌ గిల్‌ (24 బంతుల్లో 36; 6 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (34 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి ధాటిగా ఆడారు. దీంతో కోల్ కతా 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనలో రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. బట్లర్‌ (22 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా ఉతప్ప (6), స్టోక్స్‌ (18) కెప్టెన్‌ స్మిత్‌ (4), సామ్సన్‌ (1) పరాగ్ (0)వరుసగా వికెట్లు పడిపోవడంతో రాజస్థాన్ కోలుకోలేకపోయింది. చివర్లో తేవటియా (27 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ గోపాల్‌ (23 బంతుల్లో 23; 2 ఫోర్లు) ఆదుకున్నా రాజస్తాన్‌ లక్ష్యాన్ని అందుకోలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. కోల్ కతా బౌలర్ కమిన్స్‌ అద్బుతమైన 3-0-29-4 స్పెల్‌తో సత్తాను చాటాడు.