Begin typing your search above and press return to search.
చివరికి ఢిల్లీ చేతిలోనూ..చెన్నై అట్టర్ ప్లాప్
By: Tupaki Desk | 26 Sep 2020 5:15 AM GMTఐపీఎల్‌లో వరుసగా రెండో సారి చెన్నై సూపర్ కింగ్స్ ఓడి పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్లో చెన్నై జట్టు అంటే చాలు మిగతా అన్ని జట్లకు వణుకే. ఎందుకంటే మొదటి నుంచి ఆ జట్టు అన్ని విజయాలు సాధించింది. ఇప్పటికే మూడు ట్రోఫీలు గెలిచింది. ఇక ప్రతి సారి ఫైనల్స్, లేదా సెమీ ఫైనల్ దాకా కచ్చితంగా చేరుకుంటుంది. అలాంటి జట్టు బలహీనంగా కనిపిస్తుండడంతో చెన్నై అభిమానులు, ధోనీ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
శుక్రవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో విజయ డంఖా మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పృథ్వీ షా(64; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), శిఖర్ ధావన్(35; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 ఫోర్), శ్రేయస్ అయ్యర్(26), రిషభ్ పంత్(37; 25 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో 176 పరుగులు చేయగా ఛేదనలో సీఎస్‌కే తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది.
131 పరుగులకే ఆలౌట్ అయ్యి పరాజయం మూటగట్టుకుంది. సీఎస్‌కే ఓపెనర్లు షేన్ వాట్సన్(17), మురళీ విజయ్(10) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా డుప్లెసిస్(43; 35 బంతుల్లో 4 ఫోర్లు), ఒక్కడే రాణించాడు. కేదార్ జాదవ్(26), రుతురాజ్ గైక్వాడ్(5) ధోని(15), జడేజా (12)నిరాశ పరిచరచడంతో ఓటమి ఖాయమైంది.
మ్యాచ్ హైలైట్స్
* డోప్ టెస్టుల్లో పట్టుబడి క్రికెట్ కు చాన్నాళ్లుగా దూరమైన యంగ్ ప్లేయర్ పృథ్వీషా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు.
* అగ్ర శ్రేణి బౌలర్ రబడా చెలరేగాడు. అతడు ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు సాధించాడు.
* చెన్నై జట్టులో ఒక్కరు కూడా ఫామ్ లో లేకపోవడం కలవరపెడుతోంది. మొదటి మ్యాచ్ లో రాయుడు ఒక్కడే చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ జట్టు లో డుప్లెసిస్ తప్ప మిగతా బ్యాట్స్ మెన్ అందరూ మూడు మ్యాచ్లు గడిచినా ఫామ్ అందుకోలేక పోతున్నారు.
* చెన్నై బ్యాటింగ్ టెస్ట్ మ్యాచ్ ని తకపించింది. ఛేదనలోనూ బ్యాట్ జులపలేక పోయారు. 16 ఓవర్లకు 98 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయిందంటే చెన్నై బ్యాటింగ్ ఎంత నత్తనడకన సాగిందో అర్థం అవుతోంది.
* రైనా స్థానంలో వచ్చిన మురళీ విజయ్ అస్సలు ఆకట్టుకోడం లేదు. ఒకప్పటి టెస్ట్ ఓపెనర్ నే తలపిస్తూ వరుసగా మూడు మ్యాచ్ ల లోనూ విఫలం అయ్యాడు.
* రాయుడు స్థానంలో వచ్చిన రుత్ రాజ్ పై ఎన్నో ఆశలు పెట్టుకోగా అతడు కూడా వరుసగా విఫలం అవుతున్నాడు.