Begin typing your search above and press return to search.

రైనా, హర్భజన్ పై CSK సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   2 Oct 2020 11:31 AM GMT
రైనా, హర్భజన్ పై CSK సంచలన నిర్ణయం
X
సురేశ్ రైనా .. టీం ఇండియా , అలాగే ఐపీఎల్ లో CSK తరపున తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉన్న ప్లేయర్. ముఖ్యంగా ఐపీఎల్ లో ఒంటి చేత్తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ ‌మెన్. అయితే , ఇకపై సురేశ్ రైనాను ఆ టీమ్‌ లో మనం చూడలేకపోవచ్చు. రైనాతో పాటు హర్భజన్ సింగ్‌ కూడా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ లో ఉండకపోవచ్చు. బ్యాటింగ్ తో ఎన్నో మ్యాచ్ లలో సురేశ్ రైనా, తన బౌలింగ్ తో హర్భజన్ సీఎస్కేకు ఎన్నో విజయాలు అందించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ లేని csk ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఏ మేర ఆకట్టుకుంటుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే , ఐపీఎల్ 2020 సీజన్ కు ముందు జరిగిన పరిణామాలతో వారిద్దరితో ఉన్న కాంట్రాక్ట్ సంబంధాలను తెంచుకోవాలని సీఎస్కే యాజమాన్యం తాజాగా నిర్ణయించింది.

ఇప్పటికే సీఎస్కే అధికారిక వెబ్ సైట్ నుంచి వారిద్దరి పేర్లనూ తొలగించారు కూడా.2018 ఐపీఎల్ వేలం నియమ నిబంధనల మేరకు హర్భజన్, రైనాలతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ 3 సంవత్సరాల కాంట్రాక్టు కుదుర్చుకుంది. సురేష్ రైనా ప్రతి ఏటా రూ.11 కోట్లు, హర్భజన్ సింగ్‌కు రూ. 2 కోట్లు చెల్లించేందుకు ఆ ఒప్పందం జరిగింది. వాస్తవానికి కాంట్రాక్టు తాజా సీజన్‌తో ముగియనుంది. మరి దాన్ని పొడిగించాలా, వద్దా అనేది సీఎస్‌కే వ్యక్తిగత విషయం. ఐతే ఆపై దాన్ని పొడిగించుకోవాలా వద్దా అన్న విషయం ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన విషయం. అయితే టోర్నీ నుంచి తప్పుకోవడం, అనంతరం నెలకొన్న పరిణామాలతో.. రైనా, భజ్జీ కాంట్రాక్టులను తొలగించాలని CSK నిర్ణయించినట్లు సమాచారం.

ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్‌ను మీడియా సంప్రదించగా .. కామెంట్ చేయడానికి ఆయన నిరాకరించారు. అయితే, వారిద్దరి కాంట్రాక్టులు రద్దు కావని మాత్రం ఆయన అనకపోవడం గమనార్హం. ఈ సంవత్సరం తమ జట్టు తరఫున ఆడని ఆటగాళ్లకు వేతనాలు చెల్లించే అవకాశమే లేదని మాత్రం ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు పాటిస్తున్న విధి విధానాలను, ఆటగాళ్ల విషయంలో అమలు చేస్తున్న నియమ నిబంధనలను అనుసరించి, రైనా, హర్భజన్ లు ఇక ఆ జట్టు తరఫున ఆడే అవకాశాలే లేవని తెలుస్తోంది. ఇక, ఒక సంవత్సరం పాటు ఆటకు దూరమైనందున ఐపీఎల్ 2021 సీజన్ లో వీరిద్దరినీ బీసీసీఐ గుర్తించి, వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా లేదని సమాచారం.