Begin typing your search above and press return to search.

ఈసారి ఆల్ రౌండర్ల పై కన్నేసిన చెన్నై.. ఇద్దరికే కోట్లు కుమ్మరించిన బెంగళూరు!

By:  Tupaki Desk   |   21 Feb 2021 12:30 AM GMT
ఈసారి ఆల్ రౌండర్ల  పై కన్నేసిన చెన్నై.. ఇద్దరికే కోట్లు కుమ్మరించిన బెంగళూరు!
X
ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్​కింగ్స్​, ఆర్​సీబీ రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు జట్లకు విపరీతమైన ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంటుంది.

ఓ జట్టుకు టీం ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ నేతృత్వం వహిస్తుండగా.. ఆర్​సీబీ జట్టుకు టీం ఇండియా ప్రస్తుత కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి సారథ్యం వహిస్తున్నాడు. దీంతో ఈ రెండు జట్లపై సర్వత్రా ఆసక్తి ఉంటుంది.

గత ఏడాది చిన్నచిన్న పొరపాట్లు చేసిన సీఎస్​కే, ఆర్​సీబీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. దీంతో ఈ సారి అయితే ఈ ఏడాది మాత్రం జట్టు ఎంపిక దగ్గర నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.


ఐపీఎల్‌ 2021 వేలంలో సీఎస్​కే జట్టు హర్భజన్‌ సింగ్‌, షేన్‌ వాట్సన్‌, మోను సింగ్‌, పీయూష్‌ చావ్లా, మురళీ విజయ్‌, కేదార్‌ జాదవ్‌ను జట్టు వదిలేసుకున్నది.

అయితే చెన్నైలో గురువారం జరిగిన వేలంలో రూ.19.90 కోట్లతో ఆరుగురు ప్లేయర్స్‌ని టీమ్‌లోకి తీసుకుంది. ఈ సారి ఎక్కువగా ఆల్​రౌండర్స్​పై చెన్నై దృష్టి సారించింది.

కె గౌతమ్ (రూ.9.25 కోట్లు), మొయిన్ అలీ (రూ.7 కోట్లు) పుజారా (రూ.50 లక్షలు), హరిశంకర్ రెడ్డి (రూ.20 లక్షలు), రాబిన్‌ ఉతప్ప (రూ.2 కోట్లు), భగవత్ వర్మ (రూ.20 లక్షలు), సి.హరి నిశాంత్ (రూ. 20 లక్షలు) లను కొనుగోలు చేసింది. ఈ సారి మొత్తం ఏడుగురు కొత్తగా జట్టులోకి వచ్చారు.

ఐపీఎల్‌ 2021 సీఎస్​కే జట్టు ఇదే..!

మహేంద్రసింగ్ ధోనీ (కెప్టెన్​) , సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేఎం ఆసిఫ్, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో, డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, జగదీశన్, కర్ణ్ శర్మ, లుంగి ఎంగిడి, మిచెల్ శాంట్నర్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శార్ధూల్ ఠాకూర్, శామ్ కరన్, జోష్ హేజిల్‌వుడ్, ఆర్. సాయి కిషోర్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, గౌతమ్, చతేశ్వర్ పుజారా, హరిశంకర్ రెడ్డి (కడప జిల్లా), భగత్ వర్మ, హరి నిశాంత్.


ఇద్దరి కోసమే రూ. 29.95 కోట్లు వెచ్చించిన ఆర్​సీబీ..!

రాయంల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లేయర్స్‌ ఎంపికలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లింది. రూ.35.40 కోట్లతో 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (రూ.14.25 కోట్లు) బ్యాటింగ్‌, కైల్‌ జెమీషన్‌(రూ.15 కోట్లు) బౌలింగ్‌ కు దక్కించుకున్నది. గత ఏడాది పంజాబ్​ జట్టు తరఫున ఆడిన మాక్స్​వెల్​ పెద్దగా రాణించలేదు. దీంతో అతడిని పంజాబ్​ వదులుకున్నది. దీంతో ఆర్​సీబీ రూ. 14 కోట్లకు వేలంపాటలో దక్కించుకోవడం గమనార్హం.

సచిన్ బేబీ (రూ.20 లక్షలు), రాజత్ పటిదార్ (రూ.20 లక్షలు), మహ్మద్ అజహరుద్దీన్ (రూ.20 లక్షలు), డేనియల్ క్రిస్టియన్ (రూ.4.8 కోట్లు), ప్రభుదేశాయ్ ( రూ.20 లక్షలు), కేఎస్ భరత్ (రూ.20 లక్షలు)లను ఆర్​సీబీ కొనుగోలు చేసింది..

2021 సీజన్‌ ఆర్‌సీబీ జట్టు ఇదే..!

విరాట్ కోహ్లీ (కెప్టెన్​), ఏబీ డివిలియర్స్, చాహల్, దేవదత్ పడిక్కల్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, జోష్ ఫిలిప్పీ, షబాజ్ అహ్మద్, పవన్ దేశ్‌పాండే, కైల్ జెమీషన్ , గ్లెన్ మాక్స్‌వెల్ , సచిన్ బేబీ, రాజత్ పటిదార్ , మహ్మద్ అజహరుద్దీన్ , డేనియల్ క్రిస్టియన్, ప్రభుదేశాయ్ , కేఎస్ భరత్.