Begin typing your search above and press return to search.
ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే పోస్ట్ వైరల్!
By: Tupaki Desk | 14 Jun 2023 2:00 PM GMTఇండియన్ ప్రీమీయర్ లీగ్ - 2023 సీజన్ ముగిసింది. ఎన్నో అంచనాల నడుమ బరి లోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ను ముందుండి నడిపించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన జట్టును మరోసారి ఛాంపియన్ గా నిలబెట్టాడు. అయితే ఈ సీజన్ ఆరంభానికి ముందు నుంచే ధోని కి ఇదే చివరి సీజన్ అంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక పోస్ట్ ధోనీ అభిమానుల ను ఆందోళన కు గురిచేస్తుంది.
అవును... చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్ అకౌంట్ లో ధోని కి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ధోని మెట్లు ఎక్కుకుంటూ డ్రెస్సింగ్ రూం కు వెళ్తుంటాడు. ఆ సమయం లో అతడు సాధించిన ఐపీఎల్ ఘనతలు ప్లే అవుతుంటాయి. దీంతో "ఐపీఎల్ కు ఇక సెలవు" అనే అర్థం వచ్చేట్లు ఈ వీడియో ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు. పైగా... ఈ వీడియోకు "ఓ కెప్టెన్.. మై కెప్టెన్" అనే క్యాప్షన్ కూడా పెట్టి ఉంది.
దీంతో ధోనీ అభిమానులు ఆన్ లైన్ వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు చెప్పినట్లే ఐపీఎల్ కు కూడా ఉన్నపళంగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే అనుమానాలు ధోని అభిమానుల్లో మొదలయ్యాయి.
ప్రస్తుతం ధోని వయసు 41 ఏళ్లు. వచ్చే నెలలో 42ను పూర్తి చేసుకుంటాడు. అంతేకాకుండా మోకాలి గాయం తో బాధ పడుతున్నాడు. దీంతో ఈ ట్విట్టర్ పోస్ట్ నిజమేనా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
దీంతో... ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా? ఐపీఎల్ నుంచి ఆటగాడి గా వైదొలగాలని నిర్ణయించుకున్నాడా? భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ లలో ఒకరిని ఇక పై క్రికెట్ మైదానంలో చూడలేమా? అనే ప్రశ్నలు ఈ ప్రశ్నలే ఇప్పుడు అభిమానులందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి .
పైగా... ఈ ఐపీఎల్ సందర్భంగా చెపాక్ లో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత ధోని గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అభిమానుల కు అభివాదం చేసుకుంటూ వెళ్లాడు. దీంతో ఆ సంఘటన గుర్తొచ్చి మరింత ఆందోళన చెందుతున్నారు అభిమానులు!
కాగా, క్రికెట్ చరిత్ర లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకరు అనడం లో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు. 2007లో టి-20 ప్రపంచ కప్, 2011లో వండే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ని సాధించాడు ధోని. ఫలితంగా ధోనీ నాయకత్వ సామర్ధ్యం పై క్రికెట్ అభిమానులకు భారీ నమ్మకాలు ఏర్పడ్డాయి.
ఇదే సమయంలో ధోని ఐదు సార్లు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ని ఛాంపియన్ గా నిలబెట్టాడు. అయితే 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్ లో ఆడటం కొనసాగించాడు.