Begin typing your search above and press return to search.

చెన్నై ఓటములు.. రాయుడిపై ధోని సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   26 Sep 2020 6:00 AM GMT
చెన్నై ఓటములు.. రాయుడిపై ధోని సంచలన వ్యాఖ్యలు
X
కరోనా సమయంలోనూ క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ వినోదాన్ని పంచుతోంది. ఎడారిదేశంలో ఇటీవలే ఐపీఎల్-2020 ఘనంగా ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా ఇప్పటికే జరిగిన పలు ఐపీఎల్ మ్యాచులు క్రికెట్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఎప్పటిగానే ఐపీఎల్ తన ఆనవాయితీని కొనసాగిస్తూ 2019లో ఛాంపియన్.. రన్ రప్ గా నిలిచిన జట్ల మధ్య తొలి మ్యాచ్ నిర్వహించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై.. రన్ రప్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో చైన్నె విజయం సాధించింది.

ఈ మ్యాచులో రాయుడు 41బంతుల్లో 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచులో రాయుడు గాయపడటంతో జట్టు దూరమయ్యారు. ఆ తర్వాత చైన్నె సూపర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి చెందింది. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచులో చైన్నె సూపర్ కింగ్స్ 175 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఓటమి పాలైంది. దీనిపై ధోని స్పందించాడు.

చైన్నె సూపర్ కింగ్స్ జట్టులో రాయుడు లేని లోటు కన్పిస్తుందని ధోని అన్నాడు. రాయుడు లేకే చెన్నై సూపర్ కింగ్స్ చివరి రెండు మ్యాచుల్లో ఓడిందన్నారు. ఢిల్లీ మ్యాచులో తేమ లేనప్పటికీ వికెట్ నెమ్మదించిందని తెలిపారు. ప్రారంభంలో దూకుడైన బ్యాటింగ్ లేక రన్ రేటుతో ఒత్తిడి పెరిగిందని.. స్పష్టమైన కూర్పుతో బ్యాటింగ్ దిగాల్సిందంటూ ధోని చెప్పారు.

తర్వాతి మ్యాచులో రాయుడు జట్టులోకి వస్తే బ్యాటింగ్ ఆర్డర్లో సమతూకం వస్తుందని.. ఒక అదనపు బౌలర్ తో ప్రయోగం చేసే వీలుంటుందనే అభిప్రాయాన్ని మహీ వ్యక్తం చేశాడు. చెన్నై కింగ్స్ తదుపరి మ్యాచ్ వరకు రాయుడు అందుబాటులోకి వస్తాడో లేదో వేచి చూడాల్సిందే..!