Begin typing your search above and press return to search.
ధోని బలం సరిపోలేదు.. సీఎస్కే ఫ్యాన్స్ ఆశ తీరలేదు
By: Tupaki Desk | 13 April 2023 11:27 AM GMTచెన్నై చిదంబరం స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్ మునివేళ్ల పై నిలబెట్టింది. ఉర్రూతలూగించింది. అయితే చెన్నై లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి రాజస్థాన్ చరిత్ర సృష్టించింది. క్రీజులో ఎంఎస్ ధోని , రవీంద్ర జడేజా ఉన్నా కూడా టీంను గెలిపించలేకపోయారు. ఒకే ఒక కుర్ర బౌలర్ సందీప్ శర్మ ధోనిని నిలువరించారు. రెండు సిక్సులు కొట్టి ధోని గెలిపించే ప్రయత్నం చేసినా కూడా వెనక్కిపోలేదు. యార్కర్లతో ధోనిని కట్టడి చేసి చెన్నై ని ఓడించాడు. రాజస్థాన్ కు అద్భుత విజయం అందించాడు. ఇందులో ధోని బలం సరిపోలేదు.. సీఎస్కే ఫ్యాన్స్ ఆశ తీరలేదు.
రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే విజయానికి చేరువైంది. క్రీజులో ధోని, జడేజా ఉన్నారు. విజయం చెన్నైదే అనుకున్నారు. ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 6 బంతుల్లో 21 పరుగులు అవసరమయ్యాయి. సందీప్‌శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు వైడ్లు వేసి తర్వాతి బంతిని డాట్ చేశాడు. తర్వాత వరుసగా రెండు సిక్స్‌లు బాదిన ధోనీ తర్వాత ఓ సింగిల్ తీశాడు. చివరి రెండు బంతుల్లో చెన్నై విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. జడేజా సింగిల్ తీశాడు. చివరి బంతికి కూడా సింగిలే రావడంతో రాజస్థాన్ విజయం లాంఛమైంది.
తీవ్ర ఒత్తిడిలోనూ సందీప్‌శర్మ యార్కర్ లెంగ్త్ బౌలింగ్ వేయడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోనీ నే నిలువరించావ్.. నువ్వు తోప్పుపో అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
రాజస్థాన్ బౌలర్ సందీప్‌శర్మ లాస్ట్ ఓవర్‌లో రెండు వైడ్లు, రెండు ఫుల్ టాస్‌లు వేశాడు.. ఇంకేముంది.. చివరి మూడు బంతులు కూడా అలానే వేస్తాడని.. ధోనీ సిక్సర్ తో మ్యాచ్ గెలిపిస్తాడని ఫ్యాన్స్ ఊహించుకున్నారు. అయితే లాస్ట్ త్రీ బాల్స్ సందీప్‌శర్మ ఎవరూ సిక్స్ కొట్టలేని లెవల్‌లో వేశాడు. చివరి మూడు బంతుల్లో చెన్నై విజయానికి 7 పరుగులే అవసరమవ్వగా.. సందీప్‌శర్మ అద్భుతమైన యార్కర్లతో మూడు పరుగులే ఇచ్చి రాజస్థాన్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.
క్రీజ్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తున్నాడంటే.. అతనికి బౌలింగ్ చేసే బౌలర్‌కు కాస్త భయం ఉంటుంది. ఇక విజయాన్ని నిర్దేశించే చివరి ఓవర్ వేసే బౌలర్ అయితే వణుకు పుడుతుంది. అంటే క్రీజులో ఉంటే బౌలర్‌పై ప్రెజర్ ఉంటుంది.. దాని తట్టుకోని లైన్‌లో బౌలింగ్ వేయడం చాలా కష్టం. గతంలో మేటీ బౌలర్లు సైతం ధోనీ దెబ్బకు చివరి ఓవర్లో హడలిపోయారు.. లయా తప్పిన బంతులు వేసి ఫుల్ టాస్‌లతో కొట్టించుకున్నారు.. కానీ సందీప్ శర్మ మాత్రం ధోనిని నిలువరించి రాజస్థాన్ ను గెలిపించి హీరోగా మిగిలాడు.