Begin typing your search above and press return to search.
భజ్జీ అనవసరంగా బుక్కైపోయాడుగా.. !
By: Tupaki Desk | 15 Oct 2020 1:30 PM GMTమాజీ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ (భజ్జీ) అనవసర వివాదంలో చిక్కుకొని సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ప్రస్తుతం హర్బజన్ చైన్నై సూపర్‌కింగ్స్ ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారాడు. రీసెంట్గా సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ చివర్లో అంపైర్ వైడ్ బాల్ ఇవ్వబోయి.. ధోనీని చూసి ఆగిపోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో పలువురు క్రికెట్ అభిమానులు ధోనీ తీరును ఎండగట్టారు. మహీ అంపైర్‌ను బెదిరించేలా ప్రవర్తించాడని.. ఇది హుందాగా లేదంటూ పలువురు కామెంట్లు చేశారు. అయితే ఈ విషయంలో ధోనీ తప్పేం లేదని.. నిర్ణయం మార్చుకోవడం అంపైర్‌దే తప్పని కొందరు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ను వెనుకేసుకొస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అప్పటికే గెలిచే స్థితిలో లేదు. ఒకవేళ అది వైడ్‌బాల్‌గా డిక్లేర్ అయినా చైన్నై సూపర్‌కింగ్స్ కు వచ్చే నష్టం లేదు. కానీ అదే హోరాహోరీ మ్యాచ్ గనక అయిఉంటే మాత్రం వివాదం పెద్దదయ్యేదే. అయితే ఈ వివాదంలో అనవసరంగా హర్బజన్ సింగ్ తలదూర్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ యువ క్రికెటర్లు అబ్దుల్ సమద్, ప్రియ్ గార్గ్, అభిషేక్ శర్మ తదితరులు ధోనీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి మహీ కొన్ని టిప్స్ చెబుతూ కనిపించాడు. ధోనీ మాటలను శ్రద్ధగా విన్న అబ్దుల్ సమద్.. ఆ ఫొటోను ‘ఇంపార్టెంట్ లెస్సన్స్’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశారు. అయితే ఆదిత్య శ్రీనివాస్ అనే వ్యక్తి యస్ అనే క్యాప్షన్‌తో వైడ్ బాల్ కాంట్రవర్సీ వీడియోతో రిప్లయ్ ఇచ్చాడు. అయితే భజ్జీ మాత్రం లాఫింగ్ ఎమోజీలు పెట్టి ఈ వీడియోను రీ ట్వీట్ చేశారు.
దీంతో చైన్నై సూపర్‌కింగ్స్ అభిమానులు మండిపడుతున్నారు. భజ్జీ విశ్వాసఘాతకుడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముంబై ఇండియన్స్ భజ్జీని రిలీజ్ చేసినప్పుడు ధోనీ తీసుకోకుంటే బాగుండేదంటూ.. విరుచుకుపడుతున్నారు. రెండేళ్లపాటు యెల్లో ఆర్మీ తరఫున ఆడి.. ఇలాగేనా స్పందించేదంటూ ఓ రేంజ్‌లో ఏకి పారేస్తున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీకి చెందిన కరోనా బాధితులకు ‘షాహిద్ ఆఫ్రిదీ ఫౌండేషన్’ విరాళాలు సేకరిస్తే భజ్జీ మద్దతిచ్చాడు. ‘నువ్వు పాకిస్థాన్ క్రికెటర్లకు మద్దతిస్తావు.. కానీ ధోనీని మాత్రం ఎగతాళి చేస్తావా’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.