Begin typing your search above and press return to search.
గవర్నర్ సీరియస్: పంచాయితీ లొల్లిపై సీఎస్ - నిమ్మగడ్డకు పిలుపు
By: Tupaki Desk | 27 Jan 2021 3:37 AM GMTసుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏపీలో పంచాయితీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు సహకరిస్తూ ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆయన చేయమన్నా బదిలీలన్నీ ఏపీ ప్రభుత్వం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ‘పంచాయితీ’ గవర్నర్ వద్దకు చేరుతోంది. ఎన్నికల వేళ కీలక పరిణామాలు ఈరోజు చోటుచేసుకుంటున్నారు.
ఏపీలో పంచాయితీ లొల్లిపై గవర్నర్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఇవాళ రాజ్ భవన్ కు రావాల్సిందిగా ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఏపీ సీఎస్ అధిత్యనాథ్ దాస్ లకు గవర్నర్ భిశ్వభూషణ్ ఆదేశించారు. ఉదయం 10.15 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డతో.. 10.30 గంటలకు సీఎస్ ఆధిత్యనాథ్ తో గవర్నర్ భేటి కానున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇద్దరి నుంచి సమాచారం గవర్నర్ తెలుసుకుంటారు.
ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ కంటే ముందే ఎస్ఈసీ, సీఎస్ లతో గవర్నర్ భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం ఆదేశాలా? లేక పంచాయితీల రచ్చ నేపథ్యంలో గవర్నర్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తారా అన్నది చర్చనీయాంశమవుతోంది.
పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ తో ఎస్ఈసీ నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయాలు, బదిలీలు చేసుకుంటూ ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుకుతున్నారు. జగన్ ప్రభుత్వం సైతం వ్యూహ ప్రతివ్యూహాలతో రక్తికట్టిస్తున్నారు. ఇప్పటికే పంచాయితీ రాజ్ ముఖ్య అధికారులపై తీవ్ర చర్యలకు నిమ్మగడ్డ రెడీ అయ్యారు. దానిపై ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఇప్పుడు ఈ పరోక్ష యుద్ధంలో గవర్నర్ ఏం చేయబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది.