Begin typing your search above and press return to search.
కేంద్ర ప్రభుత్వానికి సీఎస్ ఆధిత్యనాథ్ సంచలన లేఖ!
By: Tupaki Desk | 26 Jan 2021 6:45 AM GMTసుప్రీంకోర్టు తీర్పుతో ఏపీలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఎదురైంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ తాజాగా కేంద్రప్రభుత్వానికి సంచలన లేఖ రాశారు.
రాష్ట్రంలో ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పంచాయితీ ఎన్నికలు.. ఒకేసారి రెండూ ఎలా నిర్వహించాలో మార్గనిర్ధేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసింది. ఒక వైపు ప్రధాని మోడీ ఈనెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన కరోనా వాక్సినేషన్ రాష్ట్రంలో చురుకుగా కొనసాగుతోందని.. ఈ టైంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు ఎలా నిర్వహించాలని నివేదించింది. ఈ రెండూ ఏకకాలంలో ఎలా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ కు సోమవారం లేఖ రాశారు.
మోడీ ప్రారంభించిన వ్యాక్సినేషన్ ఏపీలోనూ కొనసాగుతోందని.. ఇప్పటికే రాష్ట్రంలో 3.8 లక్షల మంది ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ వేశామని సీఎస్ లేఖలో పేర్కొన్నారు. 73వేల మంది పోలీసులు, మరో 7 లక్షల మంది ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేయించాల్సి ఉందని తెలిపారు. వీరే కాదు.. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ విభాగాలతోపాటు ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు 2041 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ చేయాల్సి ఉందని వివరించారు.
పంచాయితీ ఎన్నికల కోసం వేల మంది పోలీసులు, ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి ఉండడంతో వీరందరికీ వ్యాక్సిన్ ఎలా వేయాలో చెప్పాలని కేంద్రాన్ని సీఎస్ కోరారు. పనిచేసే చోట వ్యాక్సిన్ ఇవ్వాలని ప్లాన్ చేశామని.. మరి మరో చోట విధులు నిర్వహిస్తే ఎలా వేయాలని కోరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఎలా చేయాలో చెప్పాలని కేంద్రాన్ని సీఎస్ లేఖలో కోరారు.