Begin typing your search above and press return to search.

'క్రీప్టో క్వీన్' రూజా స్కాం.. తెలిస్తే మైండ్ బ్లాక్..

By:  Tupaki Desk   |   20 Nov 2021 11:30 PM GMT
క్రీప్టో క్వీన్ రూజా స్కాం.. తెలిస్తే మైండ్ బ్లాక్..
X
దొంగతనం.. మోసం.. చేసేవారికి ఒకప్పుడు ప్రత్యేక క్వాలిఫికేషన్ ఉండేవి. అంటే పెద్ద పెద్ద మీసాలు, వారి అవతారాల అదోరకంగా కనిపించేవి. కానీ ఇప్పుడు కొందరు దోపిడి చేసేవారు ‘స్మార్ట్’ గా ఉంటున్నారు. మనకు తెలయకుండా మన జేబులోనుంచే డబ్బును లాగేసుకుంటున్నారు. అంచనాలకు అందని డబ్బును కొల్లగొట్టడంలో నీరవ్ మోడీ, కింగ్ ఫిషర్ విజయ్ మాల్యలు మించినోళ్లు లేరు. ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసిన దోపీడీ చేశారు. వీరిద్దరు కలిసి బ్యాంకులకు మోసం చేసి విదేశాలకు పారిపోయారు. వీరి కోవలోనే బల్గేరియా దేశానికి చెందిన డాక్టర్ రూజా బిలియన్ డాలర్లను కొల్లగొట్టారు. క్రిప్టో కరెన్సీ ద్వారా ఆమె చేసిన తతంగం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

బల్గెరియా దేశానికి చెందిన డాక్టర్ రుజా ఇగ్నటోవా వన్ కాయిన్ అనే సంస్థను 2015లో ఏర్పాటు చేశారు. వన్ కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ ఎక్ష్చేంజ్ కంపెనీ. భవిష్యత్తులో వచ్చే ఆర్థిక మాంధ్యం నుంచి తప్పించుకోవడానికి డిజిటల్ కరెన్సీ అవసరమని రూజా వాదించారు. ఇందులో భాగంగానే ఆమె వన్ కాయిన్ అనే సంస్థను స్థాపించారు. అంతేకాకుండా అమెరికా, యూకే దేశాలు తిరుగుతూ సెమినార్లు ఇచ్చారు. సాధారణంగా బ్యాంకులు క్రిప్టో కరెన్సీకి హామీ ఇవ్వరు. కానీ ఇగ్నోటోవా మాత్రం తమ సంస్థ బిట్ కాయిన్ లకు హామీ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో రెండు సంవత్సరాల్లో వన్ కాయిన్ సంస్థ 600 మిలియన్ పెట్టుబడులను రాబట్టింది.

2017లో ముంబయిలో వన్ కాయిన్ సంస్థ ఓ సెమినార్ ను ఏర్పాటు చేసింది. ఈ సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి వన్ కాయన్ ఉద్యోగుల వద్ద నుంచి 17 మిలియన్ డాలర్లను స్వాధీన పరుచుకున్నారు. అయితే ఇది జరిగిన కొన్నాళ్ల తరువాత డాక్టర్ రుజా కనిపించకుండా పోయారు. అయితే ఆమెను కిడ్నాప్ చేశారని ప్రచారం సాగింది. ఆ తరువాత ఆమె తమ్ముడు వన్ కాయిన్ సంస్థను నడించారు. కానీ 2019లో లాస్ ఏంజీల్స్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఆ తరువాత వన్ కాయిన్ ఫ్రాడ్ కంపెనీ అని ఎఫ్ బీ ఐ ప్రకటించింది. కానీ అప్పటికే డాక్టర్ రూజా 12 బిలియన్ డాలర్లతో దేశం విడిచి పెట్టింది. అయితే ఇన్వెస్టర్లకు క్రిప్టో కరెన్సీ అని చెప్పిన రూజా అతి తెలివిగా వారి వద్ద నుంచి బిలియన్ డాలర్ల డబ్బును కొట్టేసింది.

బ్రిటన్ లోని లాయర్లు డాక్టర్ రూజా గురించి చాలా విషయాలు చెప్పారు. కెన్సింగ్టన్లోని అబాట్స్ హౌజ్ అపార్ట్ మెంట్ బ్లాక్ లో ఇంతకు ముందు పర్టర్ గా పనిచేసిన ఓ వ్యక్తి షాపింగ్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇగ్నటోవాను చూసినట్లు తెలిపారు. ఆమె ఇద్దరు బాడీ గార్డులతో కలిసి కనిపించినట్లు తెలిపారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా షాపింగ్ చేసేవారు. కాల్విన్ క్లెన్ లకు చెందిన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసేవారు. ఆమె నివసించే ఇల్లు నాలుగు పడక గదులు కలిగి ఉంటాయి. అందులో ఓ స్విమ్మింగ్ ఫూల్ కూడ ఉంటుంది.

సెప్టెంబర్ 17న డాక్టర్ రుజాకు సంబంధించిన జర్మన్ న్యాయవాది మార్టిన్ బ్రీడెన్ బాచ్ మనీ లాండరింగ్ ఆరోపణలపై కోర్టుకు హాజరయ్యారు. విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేయడానికి లండన్లోని ఓ సంస్థకు రెండు కోట్ల యూరోలను బదిలీ చేసిన కేసులో ఈయన ఉన్నారు. ఏమాత్రం రిజిస్టర్ కానీ వన్ కాయిన్ సంస్థకు రూజా దాదాపు 33 వేల కోట్ల రూపాయల స్కామ్ చేశారు. 2016 ఆగస్టులో యూరప లోని ఓ దేశానికి చెందిన ఫైనాన్సియల్ రెగ్యులేటర్లు వన్ కాయిన్ గురించి హెచ్చరిక జారీ చేశారు. ఇది జరగడానికి కొన్ని నెలల ముందే 2011లో డాక్టర్ రుజాకు చెందిన ఓ మెటల్ ఫ్యాక్టరీ కొనుగోలులో అవకతవకలకు పాల్పడినట్లు జర్మన్ కోర్టులో ఆయన అంగీకరించారు.