Begin typing your search above and press return to search.
వామ్మో.. వాయ్యో.. తనివితీరా ఏడ్వండి..
By: Tupaki Desk | 17 Dec 2019 4:30 AM GMTనవ్వే ఆడదాన్ని.. ఏడ్చే మగాడిని నమ్మొద్దంటారు. కానీ పాపం ఇంటా బయటా జీవితంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించే మగాడు తన బాధను ఎలా వెళ్లగక్కుకోవాలి. ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో ఒత్తిడులు,అవమానాలు, ఎక్స్ ట్రా చాలా బాధకరమైన అనుభవాలుంటాయి.. వాటిని ఎలా చెరిపేసుకోవాలి.. అంటే ఏడవాలని అంటున్నారు నిపుణులు.
‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్ సీన్ అదీ. అత్తను తీసుకుపోవడం కోసం అల్లుడు పవన్ కళ్యాణ్ పడ్డ తపనను అంతా చెప్పేస్తాడు. అత్త కరిగిపోయి వస్తానంటుంది. ఆనందంలో పవన్ ఏడ్చేస్తాడు. అక్కడున్న వారు ఏడవ వద్దని అంటే.. ‘తనివితీరా ఏడవనివ్వండి.. ఇన్నేళ్లా భారం దించుకోనివ్వండి’ అంటుంది పవన్ అత్త. బాధను, ఆవేదనను దించుకోవడానికి ఏడవాలని పెద్దలు, వైద్యులు సూచిస్తున్నారు. అదే మంచిదంటున్నారు. కానీ ఇప్పుడు ఏంత బాధున్న ఎవ్వరూ ఏడ్వడం లేదు. ఏడిస్తే అదో టైపులా చూస్తున్నారు. అన్ని బాధలు దిగమింగుకుంటున్నారు.
ఇప్పుడు నవ్వడానికి లాఫ్టర్ క్లబ్ లు వచ్చాయి. ఏదైనా పార్క్ లోనో.. కార్యాలయంలో కూర్చొని పిచ్చోళ్ల మాదిరి నవ్వేసి వ్యాయామం చేసుకుంటాం.మరి మన కష్టాలు, కన్నీళ్లను ఎలా అదిమి పట్టుకోగలం.. అందుకే తనివితీరా ఏడ్వడంని ఇప్పుడు హైదరాబాద్ లో కొత్తగా ‘క్రయింగ్ క్లబ్సులు’ వచ్చేశాయి.
సికింద్రాబాద్ లోని గుజరాతి సేవ మండల్ ఆధ్వర్యంలో ‘అల్వేస్ బీ చీర్ ఫుల్ లాఫర్ అండ్ క్రైయింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ’ ఏర్పాటైంది. వీరు నెలకోసారి ఏడవండని ఓ క్లబ్ ప్రారంభించింది. నవ్వడానికి లేని సిగ్గు ఏడ్వడానికి ఎందుకు అని ఈ క్రైయింగ్ క్లబ్ కు ఊపిరిపోశాడు కమలేష్ మాసాలావాలా.. ఈ సూరత్ వాసి క్రైయింగ్ వ్యాయామాలకు శ్రీకారం చుట్టి తనివితీరా ఏడ్వడంని ప్రోత్సహిస్తున్నాడు.
ఏడ్వడం వల్ల మనసు ప్రశాంతమవుతుందని.. గుండెల నిండా భారం దిగిపోతుందని.. ఏడుపు వల్ల కళ్లు, కన్నీటి వాహకాలు శుభ్ర పడి కంటి సమస్యలు దూరం అవుతాయని ఆప్తమాలజిస్ట్ తెలుపుతున్నారు. ఒంటరిగా బాధపడే వారు ఇలా అందరితో ఏడ్వడం వల్ల తమ నష్టాలు, కష్టాల నుంచి బయటపడుతారు అని చెబుతున్నారు.
బాగా బాధలున్న 20 మంది లీడింగ్ సభ్యులు మొదట ఏడ్వడం ప్రారంభిస్తే వారి కష్టాలు చూసి అందరూ ఆ మూడ్ లోకి వెళ్లి మిగతా వారు ఏడ్చేస్తారట.. ఇలా అణిచిపెట్టుకున్న తమ భావోద్వేగాలను ఇలా ఏడ్చేసి తీర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏడవడం వల్ల మనసంతా తేలికపడి మనసులో బాధ తేలిపోతుందని.. గొప్ప రిలాక్సేషన్ దక్కుతుందని చెబుతున్నారు. సో మీరు కూడా ఏడవాలనుకుంటే సికింద్రాబాద్ లోని ఈ క్లబ్ కు వచ్చేయండి..