Begin typing your search above and press return to search.
విశాఖ వాసుల కోసం విహార నౌక
By: Tupaki Desk | 5 May 2022 2:30 AM GMTవిశాఖ వాసులకు విహారానికై నౌకాయానం చేయాలని ఉంటుంది. అలాంటి విహార నౌకలు అయితే ఇప్పటిదాకా అందుబాటులో లేవు. కానీ ఫస్ట్ టైమ్ ఎంప్రెస్ అనే ఒక విదేశీ నౌక ఈ ముచ్చట తీర్చడానికి సరాసరి విశాఖ వస్తోంది. ఈ నౌక విశాఖకు నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి మళ్లీ విశాఖకు వస్తుంది.
ఇలా నౌకా విహారానికి విశాఖ వాసులకు అవకాశం దక్కుతోంది. ఇక ఈ విహార నౌకలో విహరించాలనుకునేవారు ఎంచుకునే సర్వీసును బట్టి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. దాదాపుగా 1800 మంది వరకూ ప్రయాణీకులు ఈ నౌకలో ఒక ట్రిప్పులో ప్రయాణించడానికి వీలుంటుంది. ప్రస్తుతం విశాఖ నుంచి చెన్నై వరకు విహరించడానికి టిక్కెట్లు విక్రయిస్తున్నారు.
ఇక ఈ విహార నౌక ప్రత్యేకత ఏంటి అంటే ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు అందులో ఉంటాయి. అలాగే ఈతకొలను, ఫిట్‌నెస్ కేంద్రం తదితర సౌకర్యాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు పగలు ఈ నౌకలో చూసేందుకు అనేక రకాలైన కార్యక్రమాలను రూపొందించారు. అలాగే, కాసినోను చూడడానికి అనుమతిస్తారు. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలున్నాయి.
ఇక విశాఖ నుంచి బయల్దేరే ఈ నౌక పుద్దుచ్చేరి మీదుగా చెన్నై చేరడానికి నాలుగు రోజులు సమయం పడుతుంది. తిరిగి అక్కడ నుంచి విశాఖకు చేరుకుంటుంది. ఇలా జూన్ నెలలో 8, 15, 22 తేదీలలో మూడు సార్లు విశాఖ నుంచి ఈ విహార నౌక చెన్నై వెళ్ళి వస్తుంది. అంటే ట్రిప్ కి 1800 వంతున దాదాపుగా అయిదు వేల మంది విశాఖ వాసులు ఈ నౌకాయానం చేస్తూ విహారాన్ని చేసే అవకాశం ఉంది అన్న మాట.
ఒక విధంగా విశాఖ వాసుల చిరకాల కోరిక ఇది. విదేశాల్లో ఉన్న విధంగానే విహార యాత్రల కోసం నౌకలను అందుబాటులో ఉంచాలని విశాఖ పోర్టుకు ఎన్నో సార్లు విన్నపాలు చేస్తూ వస్తున్నారు. దానికి ప్రతిస్పందనగా ఎంప్రెస్ ని తీసుకువచ్చారు. ఈ విహారయాత్రకు కనుక మంచి స్పందన వస్తే ఫ్యూచర్ లో విశాఖ పోర్టు నుంచి మరిన్ని విహార నౌకలు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా విశాఖ నగరానికి వచ్చేనెల 8వ తేదీన అతిపెద్ద క్రూయిజ్ వస్తోందని, దానికి సంబంధించి నౌకాశ్రయంలోకి రావటానికి అన్ని రకాలైన అనుమతులు ఇచ్చామని విశాఖ నౌకాశ్రయం ఛైర్మన్ కె.రామమోహనరావు తెలిపారు. అలాగే, ఇతరశాఖల అధికారులకు కూడా సమాచారం తెలియజేశామని అన్నారు. మరి ఈ ఈ సువర్ణ అవకాశాన్ని విశాఖ వాసులు ఎల సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.