Begin typing your search above and press return to search.
మహమ్మారి ఎఫెక్ట్: ప్రేక్షకులు లేని గ్రౌండ్ లో ఫేక్ సౌండ్స్ తో క్రికెట్ మ్యాచ్
By: Tupaki Desk | 7 July 2020 8:30 AM GMTమహమ్మారి వైరస్ కారణంగా క్రీడా రంగం పూర్తిగా దెబ్బతింది. ఒక్క కార్యక్రమం జరగకుండా అన్నీ నిలిచిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నా క్రీడా పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూనే పోటీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కొన్ని క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. అయితే ప్రేక్షకులు లేకుండా పోటీలు జరిగాయి. అభిమానులు.. ప్రేక్షకుల సందడి లేకుండానే మ్యాచ్ లు కొనసాగాయి. అయితే ప్రేక్షకులు లేకపోవడంతో గతంలో జరిగిన మ్యాచ్ లో జరిగిన ప్రేక్షకుల అల్లరి.. అభిమానుల అరుపులు.. కేకల సౌండ్ తీసుకుని ప్లే చేయనున్నారు. ఆటగాళ్లకు ఆ విధంగా ఉత్సాహం తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు. అదెక్కడంటే.. సౌతంప్టన్‌లో..
జూలై 8వ తేదీ నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టెస్టుల్లో భాగంగా తొలి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ జరిగినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ అభిమానులను అనుమతించే పరిస్థితులు లేవు. ఇరు జట్ల అభిమానులు ఉంటే ఆ క్రేజే వేరు. సిక్స్ కొట్టినా, సెంచరీలు చేసినా, వికెట్ పడినా కేకలు, ఈలలతో స్టేడియం సందడిగా ఉండేది. ఆ అరుపులు.. కేకలతో ఆ ప్రాంతం హోరెత్తిపోతుంది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీంతో నిర్వాహకులు కొత్తగా ఫేక్ సౌండ్స్ వాడేలా నిర్ణయించారు.
ప్రేక్షకులు లేకపోవడంతో ఆట ఆడే క్రీడాకారుల్లో జోష్ నింపేందుకు స్టేడియంలో క్రికెట్ ఫ్యాన్స్ కేకలు, ఈలలతో నింపిన ఫేక్ ఆడియోను మ్యాచ్‌లో హైలైట్ మూమెంట్స్ సందర్భంలో ప్లే చేయాలని నిర్ణయించారు. మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే అభిమానులు కూడా స్టేడియంలో ఉన్న అనుభూతిని ఆస్వాదిస్తారని వారి భావన. ఈ శబ్ధాలను ప్లే చేసేందుకు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు అంగీకరించాయి. ఈ సరికొత్త క్రికెట్ మ్యాచ్ రేపు జరగనుంది.