Begin typing your search above and press return to search.

డ్రైనేజీపాలు కాబోతున్న కోటిన్నర లీటర్ల బీరు ...బోరున విలపిస్తున్న మందుబాబులు!

By:  Tupaki Desk   |   28 April 2020 11:50 AM GMT
డ్రైనేజీపాలు కాబోతున్న కోటిన్నర లీటర్ల బీరు  ...బోరున విలపిస్తున్న మందుబాబులు!
X
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి స్వైర విహారం చేస్తోంది. కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్యం షాపులు బంద్ అవ్వడంతో మద్యం దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. కొన్ని చోట్ల మందులేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొన్ని చోట్ల మందు అనుకోని ఏవేవో తాగి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం గా ఈ లాక్ డౌన్ వేళ మందుబాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు.

ఇలాంటి సమయంలో ఏకంగా కోటిన్నర లీటర్ల బీరు డ్రైనేజీపాలు అవ్వబోతుంది అని తెలుసుకోని మందుబాబులు తెగ ఫీల్ అవుతున్నారట. అసలే మద్యం దొరక్క మందుబాబులు ఎర్రగడ్డకి క్యూ కట్టిన నేపథ్యంలో ఈ వార్త వెలుగులోకి రావడంతో ఆ నేల పాలు కావాల్సిన సరుకు మా గొంతులో పోస్తేనేం అని అనుకుంటున్నారు. మొత్తంగా అంత మద్యం నేల పాలు కావడానికి ముఖ్యకారణం ..కరోనా లాక్ డౌన్.

పూర్తి వివరాలు చూస్తే .. బీరు తయారైన తేదీ నుంచి సుమారు ఆరు నెలల పాటు వినియోగించుకోవచ్చు. ఈ లెక్కన చూస్తే రాష్ట్రవ్యాప్తంగా బీర్లు తయారుచేసే బేవరేజెస్‌ సంస్థలు, ఎక్సైజ్‌ డిపోలు, వైన్‌ షాపులు, బార్లలో సుమారు 20 లక్షల కాటన్ల బీరు నిల్వ ఉన్నట్టు అంచనా. లీటర్ల లెక్కన తీసుకుంటే సుమారు కోటిన్నర లీటర్ల బీరు గడువు తీరిపో వడంతో వినియోగానికి పనికి రాకుండా పో తోందని ఆబ్కారీ శాఖ లెక్కలు వేస్తోంది. ఏప్రిల్‌ లో సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల కాటన్ల మేర బీరు విక్రయమయ్యేది. దీని విలు వ సుమారు రూ.600 కోట్లు .

నిజానికి బీర్ల ఉత్పత్తి మార్చి నెలాఖరు నుంచే పలు బేవరేజెస్ ‌లో నిలిచిపోయింది. అప్పటికే తయారుచేసిన స్టాకు పలు బా ట్లింగ్‌ యూనిట్లు, ఆబ్కారీ డిపోలు, బార్లు, వైన్స్, క్లబ్ ‌లలో నిల్వ ఉంది. ఇందులో 6నెలల గడువు తీరిన స్టాక్‌ 20 లక్షల కాటన్ల మేర ఉంటుందని అంచనా. ఒక్కో కాటన్‌ లో 12 బీర్లు ఉంటాయి. ఒక్కో సీసాలో 650 మి.లీ బీరు ఉం టుంది. ఈ లెక్కన సుమారు 1.56 కోట్ల లీటర్ల బీరుకు గడువు తీరిపోయిందని ఆబ్కారీ అధికా రులు చెబుతున్నారు. దీనిని అనివార్యంగా డ్రైనేజీ పాలు చేయాల్సిందేనని అంటున్నారు .