Begin typing your search above and press return to search.
డబ్బులే డబ్బులు... ఎన్నికల వేళ జగన్ ఇలా చేస్తే...?
By: Tupaki Desk | 23 May 2023 9:14 PM GMTకేంద్రం దయ తలచింది. దాన్ని ఒప్పుకుని తీరాలి. తొమ్మిదేళ్ళ క్రితం ఉమ్మడి ఏపీ నుంచి విడిపోతున్నపుడు రెవిన్యూ లోటు భారీగా ఉంది. దాన్ని భర్తీ చేస్తామని చెప్పుకొచ్చిన కేంద్రం ఇప్పటిదాకా విడుదల చేసింది నాలుగు వేల కోట్లే అని ఒక లెక్క అయితే ఇపుడు ఇపుడు దానికి రెండున్నర రెట్లుగా పదివేల పై చిలుకు మొత్తాన్ని ఒకే దెబ్బకు రిలీజ్ చేసింది.
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు కింద రూ.10,460.87 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఆదేశాలు ఇవ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే ఈ నిధుల్ని విడుదల చేయాలని మహేంద్ర తెలిపారు.
ఈ విధంగా ఆర్ధిక కష్టాలతో ఉన్న ఏపీని ఆదుకుందనే చెప్పాలి. ఇంత పెద్ద మొత్తం ఒకేసారి కేంద్రం నుంచి ఈ మధ్య కాలంలో రాలేదు అంటే అతిశయోక్తి కాదు. దానికి ఏపీ ప్రభుత్వం జగన్ చేసిన కృషి చాలానే ఉంది. అదే సమయంలో కేంద్రం చలువ పూర్తిగా ఉంది.
ఎన్నికల ఏడాదిలో జగన్ డబ్బులు లేక ఇబ్బంది పడాలని విపక్షం గట్టిగా కోరుకుంటోంది. ఆ విధంగా ఏపీ ప్రభుత్వానికి పైసా కూడా అప్పు పుట్టకుండా చేస్తే పధకాలు ఆగిపోతాయని దాంతో జనంలో వ్యతిరేకత పెరిగి అది తమకు రాజకీయ లాభాన్ని తెస్తుందని విపక్షం ఆలోచనగా ఉంది. కానీ ఏపీ బీజేపీ నేతలు అంతా చార్జిషీట్లు పెడుతూ కత్తి కడుతున్న నేపధ్యంలో కేంద్రం ఇలా పెద్ద మనసు చూపించి నిధులు వెల్లువలా పారించడం విశేషం.
ఇది విపక్షం అవాక్కు అయ్యేలా ఉంటే వైసీపీ ఫుల్ హ్యాపీగా ఉంది.అలా ఆర్థికంగా ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలబడడంతో వైసీపీ నేతలు ఆనందిస్తున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి కాబట్టి కొండలా పేరుకుపోయిన కాంట్రాక్ట్ బిల్లులను జగన్ ప్రభుత్వ వరసబెట్టి చెల్లింపులు చేస్తే బాగుంటుంది అని అంటున్నారు.
చాలా చోట్ల కోటి రూపాయల వంటి చిన్న బిల్లులు ఉన్నాయి. ఇక వైసీపీ వారు తమ ప్రభుత్వమే కదా డబ్బు ఎక్కడికి పోతుందని ఉత్సాహంతో చాలా ఖర్చు పెట్టేసి అభివృద్ధి పనులు చేయించారు. అలా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన వైసీపీ వారు అంతా గత కొన్నేళ్ళుగా డబ్బులు రాలక బావురుమంటున్నారు.
ఇపుడు అలాంటి పెండింగ్ బిల్లులన్నింటినీ చకచకా జగన్ సర్కార్ తీర్చేస్తే టోటల్ గా వైసీపీ టాప్ టూ బాటమ్ రీ చార్జి అవుతుంది అని అంటున్నారు. ఎన్నికలు తొమ్మిది నేల దగ్గరలో ఉన్న నేపధ్యలో ఇలా బిల్లులు చెల్లించడం కూడా అవసరం. దాంతో మన ప్రభుత్వం అన్న భావన సగటు క్యాడర్ లో పెరిగి మళ్లీ నూతనోత్సాహం తో వారంతా జగన్ కోసం పనిచేస్తారు అని అంటున్నారు.
అంతే కానీ పధకాలకు మరో దానికో ఇతర ఖర్చులకో ఆ నిధులను మళ్ళిస్తే మాత్రం ఎన్నికల వేళ వైసీపీకి ఇబ్బంది అవుతుందని అంటున్నారు. కలిసొచ్చే కాలానికి కరెక్ట్ గా నిధులు దక్కాయి. మరి దాన్ని సరిగ్గా ఉపయోగించుకుని వైసీపీ అధినాయకత్వం పార్టీని ప్రభుత్వాన్ని పరుగులు తీయిస్తుందా లేదా అన్నది చూడాలని అంటున్నారు.