కన్నకొడుకు కోసం.. మొసలి పొట్టకోసి బాలుడిని తీశాడు.. కానీ

Sun Mar 07 2021 11:02:01 GMT+0530 (IST)

crocodile swallows man

ఒక పెద్ద ముసలి.. తండ్రీకొడుకులు నదికి చేపలు పట్టేందుకు రాగా ఓ ఎనిమిదేళ్ల బాలుడిని అమాంతం మింగేసింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి వల్ల కాలేదు. ముసలి బాలుడిని తీసుకొని నీటిలోకి వెళ్లిపోయింది. నమలకుండా మింగేసింది. ఆ తండ్రి గ్రామస్థులతో కలిసి వచ్చి మొసలిని చంపి దాని పొట్ట చీల్చి కొడుకును బయటకు తీశాడు. కానీ..26 అడుగుల పొడవైన మొసలి కడుపులో నుంచి ఓ బాలుడిని బయటకు తీసిన ఘటన తాజాగా వైరల్ గా మారింది. ఇండోనేషియాలో చోటుచేసుకున్న ఈ దారుణం విషాదం నింపింది.

ఇండోనేషియాలోని ఈస్ట్ కలిమన్ తన్ లో సుబ్లియాన్షా అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతడికి దిమస్ ముల్కన్ సపుత్ర అనే ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. బుధవారం ఈ తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నదిలోకి చేపలు పట్టేందుకు వెళ్లారు. ఇద్దరు చేపలు పడుతుండగా ఓ 26 అడుగుల పెద్ద ముసలి హఠాత్తుగా వచ్చి బాలుడిని లాక్కేళ్లి మింగేసింది.

తండ్రి కొడుకును కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నదిలోకి వెళ్లిపోయిన ముసలి బాలుడిని నమలకుండా మింగేసింది.

గురువారం గ్రామస్థులతో కలిసి వచ్చిన తండ్రి ఆ మొసలిని చంపి ఒడ్డుకు తీసుకొచ్చాడు. అనంతరం దాని పొట్టకోసి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశాడు. బాలుడు చనిపోవడంతో కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు నిర్వహించి బోరున విలపించారు. ఈ ఘటన అందరినీ కంటతపడి పెట్టించింది.