Begin typing your search above and press return to search.

మనోళ్లకు ఇదేం పోయే కాలం.. మొసలిని చంపి తినేశారట!

By:  Tupaki Desk   |   4 July 2020 1:30 AM GMT
మనోళ్లకు ఇదేం పోయే కాలం.. మొసలిని చంపి తినేశారట!
X
తినేందుకు ఏదైనా సరే తినేస్తామనే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అలాంటి ఆహార అలవాట్లే ప్రపంచానికి కరోనా దరిద్రాన్ని పట్టేలా చేశాయని చెప్పాలి. చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో అవి ఇవి అన్న తేడా లేకుండా ప్రతిదాన్ని చంపి తినేసే అలవాటు ఎక్కువ. చైనీయులతో పోలిస్తే.. భారతీయుల్లో అలాంటి అలవాట్లు అస్సలు కనిపించవు. ఏం పోయే కాలమో కానీ.. కొందరు చేసే వికారపు చర్యలు విన్నంతనే వణుకు పుట్టాల్సిందే. మనోళ్లు ఈ తరహా ఆహార అలవాట్లు ఏందిరా బాబు అనుకునేలా చేస్తుంది.

తాజాగా అలాంటి ఉదంతం ఒకటి ఒడిశాలో చోటు చేసుకుంది.మల్కాన్ గిరి జిల్లాలోని పొడియా బ్లాకులో కలదపల్లి గ్రామానికి చెందిన కొందరు ప్రజలు తమ గ్రామానికి దగ్గర్లోని సబేరీ నదిలో ఒక మొసలిని పట్టుకున్నారు. ఐదు అడుగులు పొడవున్న ఆ మొసలి చేతల్ని నరికి చంపేశారు.

అనంతరం మొసలి మాంసాన్ని ముక్కలు చేసి.. గ్రామస్తులు పంచుకున్నారు. అనంతరం ఆ మాంసాన్ని తిన్నట్లుగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటివి చట్టవిరుద్దమని చెబుతున్న అధికారులు నిందితుల్ని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నిందితులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. తినటం ఎందుకు? ఇప్పుడు ఇలాంటి తిప్పలుకొని తెచ్చుకోవటం ఎందుకు?