Begin typing your search above and press return to search.

అనుష్క మీద నిందేయటంతో షాకయ్యాడంట

By:  Tupaki Desk   |   10 April 2015 6:24 PM IST
అనుష్క మీద నిందేయటంతో షాకయ్యాడంట
X
ప్రపంచకప్‌ సెమీస్‌ వరకూ వెళ్లిన టీమిండియా అక్కడ చతికిలపడటం.. స్టార్‌ బ్యాట్స్‌ మెన్‌ కోహ్లీ అడ్డంగా ఫెయిల్‌ కావటం.. దానికి ఆయన ప్రియురాలు అనుష్క శర్మే కారణం అంటూ దుమ్మెత్తిపోవటం లాంటివన్నీ పాత పురాణాలే.

ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజా పరిణామం ఏమిటంటే..తన ప్రియురాలు అనుష్క మీద జనాలు ఆడిపోసుకోవటంపై విరాట్‌ కోహ్లీ స్పందించాడు. టిట్ట్వర్‌ ద్వారా తన ఆవేదనను పంచుకున్న కోహ్లీ.. సెమీస్‌ వైఫల్యం గురించి.. తన ప్రియురాలు గురించి ప్రస్తావించాడు. సెమీస్‌ లో జట్టు ఓటమి.. తన వైఫల్యంపై ట్వీట్‌ చేస్తూ..వరల్డ్‌ కప్‌ లో తాను స్థిరంగా ఆడేందుకు ప్రయత్నించానని వివరణ ఇచ్చాడు. సెమీస్‌ లో జట్టు ఓడిపోవటానికి.. అనుష్కశర్మకు సంబంధం ఏమిటంటూ స్టైయిల్‌ క్వశ్చన్‌ వేశాడు.

అంతేకాదు.. ఒక్క మ్యాచ్‌లో సరిగా ఆడకుంటే అన్ని నిందలు వేస్తారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. విరాట్‌కు మిగిలిన మ్యాచ్‌ ల మాదిరే వరల్డ్‌ కప్‌ సెమీస్‌ కూడా అయి ఉండొచ్చు కానీ.. కోట్లాది మందికి మాత్రం ఆ మ్యాచ్‌ మీద కోటి ఆశలు పెట్టుకున్నారని తెలీదా?

సెమీస్‌లో టీమిండియా ఓటమికి తామిద్దరమే కారణం అంటూ నిందలు వేయటంపై తానెంతో హర్ట్‌ అయ్యానని కోహ్లీ చెప్పుకొచ్చారు. కానీ.. కోహ్లీ ఆట తీరుతో అభిమానులు ఎంతగానో హర్ట్‌ అయిన విషయం అతగాడికి అర్థమైనట్లు లేదే.