Begin typing your search above and press return to search.

ఇలాంటి మాటలు చెప్పి పరువు తీసుకోవటం అవసరమా కొప్పుల?

By:  Tupaki Desk   |   7 Nov 2021 7:00 AM IST
ఇలాంటి మాటలు చెప్పి పరువు తీసుకోవటం అవసరమా కొప్పుల?
X
స్పష్టమైన ప్రజా తీర్పు వచ్చిన వేళ.. ప్రజల మూడ్ ను గుర్తించి కాస్త కామ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయం లో మంత్రి కొప్పుల ఈశ్వర్ తప్పులు చేస్తున్నారు. ఉప ఎన్నికల కు ముందు మాజీ మంత్రి ఈటల మీద ఎన్ని విమర్శలు చేసినా.. ఎన్నికల ప్రచారం ఖాతా లోకి వెళుతుంది. కానీ..అధికార పార్టీ అంచనాల కు భిన్నం గా పెద్ద ఎత్తున గెలుపును సొంతం చేసుకున్న ఈటలను ఉద్దేశించి టీఆర్ఎస్ నేతలు ఎవరేం మాట్లాడినా అది వారికే నష్టం చేస్తుందన్న విషయాన్ని గులాబీ నేతలు ఎంత త్వర గా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. ఉప ఎన్నికల్లో దారుణ ఓటమిని సొంతమైన వేళ.. గులాబీ నేతలు పలువురు కామ్ గా ఉంటే.. మరి కొందరు మాత్రం మాట్లాడేందుకు ధైర్యం చేశారు. నిజానికి.. ప్రజాభి ప్రాయం తమ వాదనకు భిన్నం గా ఉన్న వేళ.. ఆచి తూచి మాట్లాడటం చాలా అవసరం. ఈ విషయం లో ఏ మాత్రం తప్పులు దొర్లినా జరిగే డ్యామేజ్ అధికం గా ఉంటుంది. ఈ విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.

తాజాగా ఈటల రాజేందర్ మీద మాట్లాడిన మంత్రి కొప్పుల మాటల పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈటల అహం తో మాట్లాడుతున్నారని.. ఆయనకు వచ్చిన విజయాన్ని అతిగా ఊహించుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నుంచి ఈటల ను ఎవరూ పంపలేదన్న ఆయన.. ఈటలనే తనకు తానుగా పార్టీ నుంచి వెళ్లిపోయారన్నారు.

ఈటల అతి గా ఊహించుకోవటం మాను కుంటే మంచిదని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యల్ని ఈటల ను ఉద్దేశించి అనటం ద్వారా తన పరువును తానే తీసుకున్నట్లు అవుతుందన్న విషయాన్ని కొప్పుల మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈటల మీద అభిమానం తో ఓటు వేసి నట్లుగా కొప్పుల చెబుతున్నారు. మరి.. అలాంటి ఆయన మీద త్వర పడ ఒక్కరోజు లోనే ఈటల రాష్ట్ర నాయకుడిగా మాట్లాడుతున్నారని.. ఈటల రాష్ట్ర నేత అయితే బండి సంజయ్.. లక్ష్మణ్.. కిషన్ రెడ్డి లాంటి వారి సంగతేంటి? అంటూ కొప్పుల ప్రశ్న బాగానే ఉన్నా.. బీజేపీ లో చేరటానికి ముందే ఈటల రాష్ట్ర నేతగా గుర్తింపుపొందిన విషయాన్ని కొప్పుల మిస్ అయితే ఎవరేం చేయగలరు. ఉప ఎన్నిక వేళ ఈటలకు ఎదురైన సవాళ్లు కొప్పుల లాంటి వారికి ఎదురైతే.. ఆయన కనీసం పోరాడగలుగుతారా? అని ప్రశ్నిస్తున్నారు. తీవ్రమైన పోరు అనంతరం ఈటల విజయం సాధించిన వేళ..కొంతకాలం వరకు వేచి చూసే ధోరణిని ప్రదర్శించి.. ఆ తర్వాత విమర్శల్ని అస్త్రాలుగా సంధిస్తే బాగుంటుందన్న చిన్న లాజిక్ ను కొప్పుల ఎందుకు మిస్ అవుతున్నట్లు?