Begin typing your search above and press return to search.

టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు

By:  Tupaki Desk   |   3 Dec 2020 7:00 AM GMT
టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు
X
తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత గంజి చిరంజీవి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో జరిగిన టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో అవినీతి జరిగిందనే కారణంతో మంగళగిరి మున్సిపాలిటి మాజీ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత గంజి చిరంజీవిపై కేసు నమోదైంది. గంజితో పాటు మరో ఆరుగురు మాజీ కౌన్సిలర్లు+కొందరు అధికారులపైన కూడా మున్సిపల్ కమీషనర్ హేమమాలిని ఇచ్చిన పిర్యాదు ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు.

టిడ్కో పథకంలో నిర్మించిన ఇళ్ళ నిర్మాణంలో మంగళగిరి పట్టణంలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. ఛైర్మన్+కౌన్సిలర్లు లబ్దిదారుల ఎంపికలో భారీగా డబ్బులు వసూలు చేశారనేది ఆరోపణలు. ఈ ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంటు అధికారులు పూర్తిగా విచారణ జరిపారు. తమ విచారణలో దొరికిన ఆధారాలతో విజిలెన్స్ అధికారులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాదికారులకు నివేదిక అందించారు.

ఈ నివేదిక ఆధారంగా శాఖాపరమైన విచారణ జరిపిన మున్సిపల్ ఉన్నతాధికారులు బాధ్యులపై ఫిర్యాదు చేయాలని మున్సిపల్ కమీషనర్ హేమమాలిని ఆదేశించారు. దాంతో ఆమె చరింజీవితో పాటు కౌన్సిలర్లు, సంబంధించిన అధికారులపైన కూడా ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. క్రిమినల్ కేసులు నమోదైన తర్వాత చర్యలు తప్పదు కదా.

మరి పోలీసులు ఎప్పుడు యాక్షన్లోకి దిగుతారో చూడాలి. అప్పుడు టీడీపీ నేతలు ఏమి చేస్తారనరేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే మంగళగిరి మున్సిపాలిటి అంటే దాదాపు రాజధాని పరిధిలోని పట్టణమే. ఒకవేళ పోలీసులు యాక్షనంటు తీసుకుంటే బహుశా మొదటి ఘటన అవుతుందేమో చూద్దాం ఏం జరుగుతుందో.