Begin typing your search above and press return to search.
కర్ణాటక సీఎంతో సహా అంతమంది మీద క్రిమినల్ కేసులు?
By: Tupaki Desk | 29 May 2023 12:18 PM GMTకర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించటం.. తర్జనభర్జనల అనంతరం పెద్ద మనిషిగా చెప్పే సీనియర్ నేత సిద్దరామయ్యను కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రిగా ఓకే చేయటం తెలిసిందే.
సిద్దూను ముఖ్యమంత్రిగా.. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా వ్యవహరించే డీకే శివకుమార్ నుడిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి వర్గాన్ని ఫైనల్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులుగా ఉన్న వారిలో క్రిమినల్ కేసుల లెక్క తెలిస్తే నోట మాట రాదంతే.
పెద్ద మనిషిగా..అత్యధిక ప్రజలు చెప్పే సమర్థ సీఎంగా చెప్పిన సిద్దరామయ్య పేరు మీద 13 క్రిమినల్ కేసులు ఉండటం.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీద 19 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ఎన్నికల సందర్భంగా తాము దాఖలు చేసిన అఫిడవిట్ లో వివరాల్ని నమోదు చేశారు. డీకే మీద క్రిమినల్ కేసులతో పాటు సీబీఐ.. ఈడీ కేసులు ఉన్నాయి.
ఇక.. మంత్రుల్లోనూ పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. మంత్రుల్లో అత్యధికంగా బి.నాగేంద్ర మీద 42 క్రిమినల్ కేసులు ఉండగా.. మిగిలిన మంత్రుల్లోనూ ఎక్కువగా క్రిమినల్ కేసులు ఉన్న విషయం ఎన్నికల సందర్భంగా వారు దాఖలు చేసిన వివరాల ద్వారా వెల్లడవుతున్నాయి.
మంత్రులు ప్రియాంక ఖర్గే మీద తొమ్మిది కేసులు.. ఈశ్వర్ ఖండ్రే పైన ఏడు కేసులు ఉన్నాయి. మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మీద ఆరు క్రిమినల్ కేసులు ఉండగా.. వాటిలో హత్య కేసు కూడా ఉండటం గమనార్హం.
ఇక.. మంత్రులు ఎంబీ పాటిల్ మీద ఐదు కేసులు.. రామలింగారెడ్డి మీద 4.. పరమేశ్వర్ పై 3.. హెచ్ కే పాటిల్.. ఢి సుధాకర్.. సతీష్ జార్కిహోళిపై రెండేసి చొప్పున క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక.. ఎన్. చెలువరాయస్వామి.. మునియప్ప.. ఎస్ఎస్ మల్లికార్జునపై ఒక్కో కేసు ఉన్నాయి. ఇదంతా చూస్తే.. కర్నాటకలో కొలువు తీరిన సిద్దూ ప్రభుత్వంలో క్రిమినల్ కేసులు ఉన్న మంత్రులు పెద్ద ఎత్తున ఉండటం గమనార్హం.