Begin typing your search above and press return to search.
క్రైమ్ థ్రిల్లర్: భార్యను చంపేసి.. స్నేహితుడి ఇంట్లో పూడ్చేశాడు!
By: Tupaki Desk | 12 Feb 2023 9:50 AM GMTసినిమాల్లో జరిగే నేరాలను చూసి.. నోరునొక్కుకుని.. బుగ్గలు నొక్కుకుని అయ్యో..! ఇంత దారుణమా?! అని తెగ బాధపడిపో తుంటాం. కానీ, సినిమాలను మించిన థ్రిల్లర్ సీన్‌లు నిజజీవితాల్లోనూ చోటు చేసుకుంటున్నాయి. భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. అనంతరం.. ఎవరికీ అనుమానం రాకుండా.. తన స్నేహితుడి ఇంట్లో పూడ్చి పెట్టి చక్కటి పాల రాయితో ఫ్లోరింగ్ చేయించేశాడు. ఈ ఘటన అందరినీ నివ్వెర పరిచింది. మరి ఇది ఎలా వెలుగులోకి వచ్చింది? ఎవరు కేసు పెట్టారు? అనే విషయాలు కూడా ట్విస్టులపై ట్విస్టులే!!
జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడీ జిల్లాకు చెందిన మనీశ్ బర్న్వాల్ అనే వ్యక్తి అర్జుమన్ బానో అనే యువతిని ప్రేమించుకున్నారు. ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఆమెకు ముందే ఒక వ్యక్తితో పెళ్లయింది. తర్వాత మనీశ్‌తో పరిచయం అయి.. అది కాస్తా ప్రేమగా మారి.. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు పుట్టింది. ఇద్దరూ బాగానే ఉంటున్నారు. అయితే.. అర్జుమన్‌కు ఏమైందో ఏమో.. మళ్లీ మొదటి భర్త కుటుంబంపై గిలి పుట్టింది.
అది కూడా.. ఆమె మొదటి భర్త తమ్ముడుతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనిపై ఎందుకోఅనుమానం వచ్చిన మనీశ్.. పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ వినిపించుకోకపోవడంతో.. భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మద్యానికి కూడా మనీశ్ బానిసయ్యాడు. ఈ క్రమంలో 2021లో దుర్గాపూజకు తన భార్య, కూతురితో కలిసి కారులో మనీశ్.. స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో మనీశ్ తన ఏడాదిన్నర కుమార్తె ముస్కాన్కి కుందేలును చూపించి వస్తానని తన భార్యకు చెప్పాడు.
అర్జుమన్ తన భర్త మాటలు విని సరే అని చెప్పింది. భార్యను చంపేందుకు ఇదే మంచి సమయం అనుకున్న మనీశ్... కుమార్తెను దూరంగా విడిచి పెట్టి వచ్చి.. అర్జుమన్ కు ఉన్న చున్నీని ఆమె మెడకు బలంగా బిగించి ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని మాల్దాకు తీసుకెళ్లి తన ప్రాణ స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టి సిమెంట్తో పూడ్చిపెట్టాడు. అయితే.. ఈ క్రమంలో స్నేహితుడితో ఏం చెప్పాడన్నది.. ఆయన ఎందుకు ఒప్పుకున్నాడన్నది కూడా సస్పెన్స్‌గానే ఉండిపోయింది.
కేసు పెట్టింది కూడా.. ఆయనే!
అయితే ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత మనీశ్ స్వయంగా పోలీసులను ఆశ్రయించాడు. 2022 జనవరి 21న పచ్చంబ పోలీసు స్టేషన్లో తన భార్య కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. పోలీస్ స్టేషన్కు తన కూతురితో కలిసి వెళ్లి.. తన తల్లి లేకపోవడం వల్ల పాప పరిస్థితి దీనంగా మారిందని నిస్సహాయంగా చెప్పేవాడు. పదే పదే పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య గురించి ఏమైనా తెలిసిందా అని అడిగేవాడు. మొదట్లో మనీశ్పై పోలీసులకు అనుమానం రాలేదు.
అయితే, భార్య తరఫు బంధువులు తమ కుమార్తెను మనీశే హత్యచేశాడని ఆరోపించారు. దీంతో ఈ కేసుపై ఎస్పీ అమిత్ రేణు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే మనీశ్ తన కూతురితో కలిసి మళ్లీ పోలీసు స్టేషన్కు వచ్చి భార్య గురించి ఏమైనా తెలిసిందా అని అడగటం మొదలుపెట్టాడు. అయితే పోలీసులు ఈసారి మనీశ్ కూతురిని ఇంట్లో వదిలిపెట్టి అతడిని మాత్రమే స్టేషన్కు రమ్మని పిలిచారు. ఈ క్రమంలో నిజాన్ని కక్కించారు. మొత్తానికి సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు కనిపించవని.. పోలీసులే వ్యాఖ్యానించడం గమనార్హం.