Begin typing your search above and press return to search.
ఇది విన్నంతనే.. ‘దిశ’ ఉదంతం చప్పున గుర్తుకొచ్చేయటం ఖాయం
By: Tupaki Desk | 11 Jun 2020 6:50 AM GMTదారుణ ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని హాస్టల్ లో ఉండే ఐటీ ఉద్యోగిని ప్రేమ పేరుతో ఆరాచకంగా వ్యవహరించిన ఒక దుర్మార్గుడి ఉదంతమిది. స్నేహం పేరుతో వల వేసి.. చనువుగా వ్యవహరిస్తూ.. ఫోటోలతో బ్లాక్ మొయిల్ చేయటమే కాదు.. ఆమెను శారీరకంగా.. మానసికంగా ఎంత వేధింపులకు గురి చేశాడన్నది తెలిస్తే.. దిశ ఉదంతం చప్పున గుర్తుకు రావటం ఖాయం. అతడి వేధింపుల గురించి తెలిస్తే.. ఒళ్లు జలదరించటం ఖాయం. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
రాయలసీమకు చెందిన ఒక అమ్మాయికి హైదరాబాద్ లోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంటర్వ్యూ సమయంలో ఒక కుర్రాడు పరిచయమయ్యాడు. అతడిది కూడా తమ ప్రాంతానికే చెందినవాడు కావటం.. ఇంటర్వ్యూ కోసం రావటంతో ఆమె అనుమానించలేదు. ఆమెకు జాబ్ వస్తే.. అతడికి రాలేదు. ఆ తర్వాత స్నేహం నటించిన వాడి దుర్మార్గాన్ని గుర్తించలేదు. స్నేహితుడే కదా అని నమ్మింది. ఫోన్లో మాట్లాడుతూ.. చనువు పెంచుకున్న అతగాడు.. ఒకరోజు హటాత్తుగా ప్రేమిస్తున్నానంటూ ప్రపోజల్ పెట్టేశాడు. అలాంటివి వద్దంటూ వారించింది. అతడ్ని దూరంగా పెట్టేసింది.
అంతే.. ప్లేటు మార్చేసిన అతగాడు.. సారీ.. మనమిద్దరం స్నేహితులుగానే ఉందామంటూ నమ్మించాడు. సరేనని నమ్మిన ఆమె అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. నరకం అంటే ఏమిటన్నది ప్రత్యక్షంగా చూపించాడు. స్నేహం పేరుతో అప్పుడప్పుడు కలిసేవారు. ఈ సందర్భంగా చనువుగా ఫోటోలు దిగి తన ప్లాన్ ను అమలు చేశాడు. ఒకరోజు రెస్టారెంట్ లో కలుద్దామని చెప్పి.. ఆమెతో దిగిన ఫోటోల్ని ముందుకు పెట్టి.. తాను చెప్పినట్లు వినకుంటే సోషల్ మీడియాలోనూ.. ఆమె పని చేసే ఆఫీసులోనూ ఫోటోలతో రచ్చ చేస్తానని బెదిరించాడు. ప్రేమ పేరుతో మోసం చేసిందని అందరికి చెబుతానని హెచ్చరించాడు.
నమ్మి స్నేహం చేసిన పాపానికి ఆమె.. అతగాడి మాటలకు వణికి పోయింది. ఫోటోలు ఇవ్వమంటే.. ఒకసారి తన కోరిక తీరిస్తే ఆమెను శాశ్వితంగా తీర్చేస్తానని చెప్పాడు. భయపడిపోయిన ఆమె.. అతడి ఒత్తిడికి లొంగిపోయింది. ఆ సందర్భంలోనే మరో దుర్మార్గానికి తెర తీశాడు. హోటల్ రూపంలో రహస్యంగా కెమేరా పెట్టి.. అక్కడ జరిగిందంతా షూట్ చేశాడు. తనను వదిలేయాలన్న ఆమెతో.. కొత్త వీడియో చూపించి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. ఉద్యోగం చేయ్.. జీతమంతా నాకిచ్చేయ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
దీంతో.. తీవ్ర మానసిక ఆందోళనకు గురైన సమయంలోనే లాక్ డౌన్ ప్రకటించటంతో ఆమె సొంతూరు వెళ్లింది. హమ్మయ్య అనుకున్న వేళలో.. ఆమెకు నిత్యం ఫోన్లు చేసి నరకం అంటే ఏమిటో నిత్యం చూపిస్తూ.. రోజూ ఫోన్లు చేసేవాడు. తమ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేస్తానని బెదిరించాడు. తాను వదిలేయాలంటే.. ఆమె గుండెల మీద తన పేరును బ్లేడ్ తో రాసుకుంటే వీడియో ఇచ్చేస్తానని చెబితే.. నమ్మిన ఆ అమాయకురాలు.. ఆ పని కూడా చేసింది. అయినా.. వదలకుండా వేధిస్తున్న అతగాడి దెబ్బకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.
ఆ సమయంలో బాధితురాలి సోదరుడికి అనుమానం వచ్చింది. అసలేం జరిగిందని నెమ్మదిగా ఆరా తీయటంతో.. జరిగిందంతా చెప్పి భోరుమంది. అదంతా విన్న సోదరుడు షాక్ తిన్నాడు. వెంటనే సైబరాబాద్ పోలీసుల్ని సంప్రదించారు. కమిషనర్ సజ్జన్నార్ కు జరిగిందంతా చెప్పారు అధికారులు. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ శాడిస్టును అదుపులోకి తీసుకున్నారు. అతడి పై కేసు నమోదు చేశారు. త్వరలోనే పీడీ యాక్ట్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. మహిళలపై వేధింపులు గురైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం మంచిదని అధికారులు చెబుతున్నారు. మృగాళ్ల వేధింపులను మౌనంగా భరించొద్దని.. ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే సైబరాబాద్ షీటీమ్స్ వాట్సాప్ నెంబరు (9490617444) కు సంప్రదిస్తే సరిపోతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.