Begin typing your search above and press return to search.

నీడ‌గా ఉందని ప‌డుకోబెడితే.. నిలువునా తొక్కి చంపేశాడు

By:  Tupaki Desk   |   26 May 2023 9:30 AM GMT
నీడ‌గా ఉందని ప‌డుకోబెడితే.. నిలువునా తొక్కి చంపేశాడు
X
హైద‌రాబాద్ లో ఘోరం జ‌రిగింది. ముక్కు ప‌చ్చ‌లార‌ని చిన్నారిని ఓ ఎస్సై భ‌ర్త కారుతో తొక్కించి చంపేశా డు. ఇది ఉద్దేశ పూర్వ‌కంగా జ‌ర‌గ‌క‌పోయినా.. నిర్ల‌క్ష్యంగా కారును పార్కింగ్ చేయ‌డంతో జ‌రిగిన ఘ‌ట‌న‌లో చిన్నారి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది.

హైద‌రాబాద్‌లోని హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఉన్న లెక్చ‌ర‌ర్స్ కాల‌నీలో ఉన్న బాలాజీ ఆర్కెడ్‌ అపార్ట్‌మెంటులో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై పోలీసులు తెలిపిన క‌థ‌నం మేర‌కు నీడగా ఉందని అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ ప్లేస్‌లో పడుకోబెడితే.. చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది.

దీంతో పాప అక్కడికక్కడే దుర్మరణం చెందింది. క‌ర్ణాటకకు చెందిన కొడ్లి రాజు, కవితా దంపతులు బీఎన్‌రెడ్డి నగర్‌లో ఉంటూ బిల్డింగ్‌ స్లాబ్‌ పనులు చేస్తుంటారు.

హయత్‌నగర్‌ లెక్చరర్స్‌ కాలనీలో ఓ భవనానికి స్లాబ్‌ వేస్తున్నారు. కవిత తన కుమార్తె లక్ష్మి(3)ని బాలాజీ ఆర్కెడ్‌ అపార్టుమెంట్‌ పార్కింగ్‌ ప్లేస్‌లో పడుకోబెట్టింది. ఆర్కిటెక్చర్‌ హరిరాం తన కారును తీస్తూ చూసుకో కుండా చిన్నారిపై నుంచి తీసుకువెళ్లాడు.

దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. తనకు న్యాయం చేయాల ని చిన్నారి తల్లి బోరున విలపించింది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఆర్కిటెక్చ‌ర్ హ‌రిరాం.. ఎక్సైజ్ పోలీసు స్టేష‌న్‌లో ప‌నిచేస్తున్న ఎస్సై స్ప‌ప్న భ‌ర్త‌గా గుర్తించారు. కారు స్ప‌ప్న పేరుతో రిజిస్ట‌రై ఉంద‌ని గుర్తించారు.దీంతో కేసు న‌మోదు చేసే విష‌యంపై అధికారులు త‌ర్జ‌న బ‌ర్జ‌న ప‌డుతున్నారు. కార్మికుల కుటుంబంలో తీవ్ర క‌ల్లోలం రేపిన ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం ప‌రంగా సాయం అందించాల‌ని వారు కోరుతున్నారు.