Begin typing your search above and press return to search.
షాకిచ్చేలా వీకెండ్ క్రైం టెర్రర్
By: Tupaki Desk | 9 July 2017 5:48 AM GMTనేరాలు మామూలే. అయితే.. ఒకే రోజులో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న నేరాలు.. ఘోరాలు చూసినప్పుడు షాక్ తగలటం ఖాయం. ఒక్కరోజు వ్యవధిలో మరీ ఎంత క్రైమా? అన్న క్వశ్చన్ రావటం ఖాయం. దారుణమైన నేరాలు.. హత్యలు.. భారీ రోడ్డు ప్రమాదాలు అన్నీ ఒక్క రోజు వ్యవధిలో చోటు చేసుకోవటం.. అదీ వీకెండ్ కావటం గమనార్హం. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని రీతిలో ఎదురైన క్రైం టెర్రర్ చూస్తే నోట మాట రాదంతే.
ఈ శనివారం ఉదయం నుంచి రాత్రి మధ్యలో చోటు చేసుకున్న నేరాల తీవ్రత భారీగా ఉండటం ఈ వీకెండ్ ప్రత్యేకతగా చెప్పాలి. ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా నిన్నటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న నేరాలు.. ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పకతప్పదు. చాలానే నేరాలు చోటు చేసుకున్నా.. తీవ్రమైనవి.. భిన్నమైన నేరాల్ని.. ప్రమాదాల్ని చూస్తే..
= ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద శనివారం తెల్లవారుజాము వేళ భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా బలంగా ఢీ కొట్టటంతో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ సహా మరో ఇద్దరు ఘటనాస్థలంలో మరణించగా.. కారులో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కావలికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వీరు హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఉరుసు కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ తప్పిదమే ఈ భారీ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ప్రమాదానికి గురైన వారిలో కారు డ్రైవర్ తప్పించి.. మిగిలిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం గమనార్హం.
= దేశ రాజధాని ఢిల్లీలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలకు చెందిన 29 ఏళ్ల శ్రీకాంత్ గౌడ్ కిడ్నాప్ నకు గురయ్యాడు. క్యాబ్ లో వెళుతున్న శ్రీకాంత్ ను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ అతన్ని విడుదల చేయాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఢిల్లీలోని మెట్రో ఆసుపత్రిలో పని చేస్తున్న శ్రీకాంత్ క్యాబ్ లో వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాంత్ ను క్షేమంగా తీసుకొస్తామని.. నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
= భక్తులతో తిరుమలకు వెళుతున్న ఒక వ్యాన్ మార్గమధ్యంలో లోయలో పడిపోయింది. ఈ ఉదంతంలో మొత్తం 12 మందికి గాయాలు కాగా.. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ప్రమాదానికి గురైన వారు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.
= రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్ రాకెట్ కు సంబందించి తాజాగా మరో ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 20 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు ఆఫ్రికన్ దేశస్తుడు కాగా.. మరొకరు స్థానికుడని పోలీసులు చెబుతున్నారు. తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరితో.. డ్రగ్స్ రాకెట్ లో అరెస్ట్ అయిన వారి సంఖ్య 12కు పెరిగినట్లైంది.
= నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న ప్రియురాల్ని విశాఖకు చెందిన ప్రియుడు అత్యంత దారుణంగా హతమార్చారు. ఇరు కుటుంబాల్లో వీరి ప్రేమకు ఆమోదం ఉందని చెబుతున్నారు. కొద్దికాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం అనంతరం ప్రియుడి మానసిక స్థితి బాగోలేదని చెబుతున్నారు. అయినప్పటికీ.. ప్రేమించినవాడిని వదలకుండా.. అతడితోనే జీవితం అనుకున్న భవాని బతుకు తెల్లారిపోయింది. అనుమానంతో భవానిని అత్యంత దారుణంగా సతీష్ హతమార్చాడు. అద్దం ముక్కతో గొంతు కోసేసి.. ఆ పై నెత్తిన డంబెల్స్ తో పదే పదే మోది.. ఆపై మెట్ల మీద నుంచి కిందకు లాక్కొచ్చిన దుర్మార్గాన్ని చూసిన స్థానికులు కోపంతో అతడిపైకి దాడి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అనుమానంతోనే ప్రియురాల్ని హతమార్చిన ప్రియుడి తీరు సంచలనంగా మారటమే కాదు.. షాక్‌కు గురయ్యేలా చేసింది.
= హైదరాబాద్ శివారులోని ఇబ్రహీం పట్నం మండలం శేరీగూడలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న కె. చైతన్య ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. డీటైన్ అయ్యానన్న బాధలో కాలేజీ భవనం మూడో అంతస్తు నుంచి దూకేశాడు. తలకు తీవ్ర గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేస్తుండగా మరణించాడు. మొత్తం మూడేళ్లకు 18 సబ్జెక్ట్ ల బ్యాక్ లాగ్ తో చదువులో వెనుకబడి పోయిన అతడు మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు.
= హైదరాబాద్ మహానగరంలో శనివారం మధ్యాహ్నం దారుణ హత్య జరిగింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 7లో ఒక యువకుడ్ని అత్యంత దారుణంగా హతమార్చారు. బైక్ మీద వెళుతున్న వ్యక్తిని వెంటాడిన దుండగులు కత్తులతో కిరాతకంగా పొడిచి చంపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
= ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి దూకిన ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవటానికి ముందు క్లోజ్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి.. తాము సూసైడ్ చేసుకున్నట్లుగా చెప్పి స్టోరేజ్ ట్యాంక్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ఒకరైన యువతిని అద్దంకికి చెందిన సుప్రియగా గుర్తించారు. ప్రియుడి వివరాలు బయటకు రాలేదు.
= నిత్యం తాగేసి వచ్చి ఇంట్లో వారిని వేధిస్తున్న కొడుకునే కన్నతల్లే చంపేసిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నగరం మండలం ఈదుపలల్ఇ గ్రామానికి చెందిన 30 ఏళ్ల రామస్వామిరెడ్డి మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగేసి వచ్చి కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా వేధిస్తున్నాడు. ఇతడి తీరుతో అతడి తల్లి విసిగిపోయింది. తాజాగా మద్యం తాగి గొడవ పడి వచ్చిన కొడుకు చేతులు.. కాళ్లుకట్టేసిన తల్లి.. మురుగుగుంట కోసం తీసిన గోతిలో పడేసి.. పూడ్చి పెట్టారు. అనంతరం అనుమానంతో పోలీసులు రంగంలోకి దిగటం ఈ ఉదంతం బయటకు వచ్చింది.
= తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన ఇద్దరు స్నేహితులు బైక్ మీద వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని తిరిగి వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టటంతో ఘటనాస్థలంలోనే మరణించారు.
= భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో విసిగిపోయిన ఒక గృహిణి ఆత్మహత్య చేసుకోవటమే కాదు.. తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపేసిన వైనం షాక్ తినేలా చేసింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెంలో చోటు చేసుకుంది. బేతంపూడికి చెందిన జగదీశ్.. మీనాలకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇరువురి మధ్య విభేదాలు ఉండటంతో విసిగిపోయిన మీనా.. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి.. ఆనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.