Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో ఈ ఏడాది నేరాలు తగ్గాయ్ కానీ మోసాలు పెరిగాయ్
By: Tupaki Desk | 22 Dec 2020 10:30 AM GMTసామాన్యులు పెద్దగా పట్టించుకోరు కానీ.. హైదరాబాద్ మహానగరం మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో విస్తరించి ఉంది. హైదరాబాద్.. సైబరాబాద్..రాచకొండ పరిధిలో ఉంటుంది. సాంకేతికంగా కనిపించినా.. ఇది చాలామందికి అవసరమైన అంశం. ఎందుకంటే.. తాము నివాసం ఉండే ప్రాంతం.. ఏ కమిషనరేట్ కిందకు వస్తుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంది. పేరుకు హైదరాబాద్ మహానగరమే అయినా.. ఇంత పెద్ద నగరానికి ఒకే పోలీస్ బాస్ ఉండటం కష్టం కావటంతో.. మూడు భాగాలుగా చేశారు.
హైదరాబాద్ ను పాతనగరంతోపాటు.. సెంట్రల్ హైదరాబాద్ ఈ కమిషనరేట్ పరిధిలో ఉంటుందని చెప్పాలి. తూర్పు భాగంతో పాటు.. ఇతర జిల్లాలకు రాచకొండ కమిషనరేట్ విస్తరించి ఉంటే.. నగర ఉత్తర దిక్కుతో పాటు.. ఐటీ కారిడార్ తో పాటు శంషాబాద్ తదితర ప్రాంతాలు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కింద ఉన్నాయి. చాలామందికి సైబరాబాద్ కమిషనరేట్ అన్నంతనే.. సైబర్ నేరాలకు సంబంధించిన పోలీసు కమిషనరేట్ గా భావించే వారున్నారు. కానీ.. ఇది ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్ పరిధిలో ఉండే పోలీసు కమిషనరేట్ అన్నది మర్చిపోకూడదు.
ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ కు సంబంధించి ఈ ఏడాదిలో నేరాలు ఏ మేరకు చోటు చేసుకున్నాయన్న విషయాన్ని వివరిస్తూ నివేదికను విడుదల చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే 2019తో పోలిస్తే 2020లో నేరాల పదిశాతం తగ్గాయి. అదే సమయంలో మోసాలు మాత్రం భారీగా పెరిగాయి. నేరాలు తగ్గటానికి కరోనా కారణంగా చెప్పాలి. దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ తో పాటు.. ఆంక్షల నేపథ్యంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఇంట్లోనే ఉండటం కారణంగా.. మోసపూరితంగా ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగింది.
2019లో ఈ కమిషనరేట్ పరిధిలో మొత్తం కేసులు 25,187 కాగా.. ఈ ఏడాది 22,641 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆస్తి సంబంధమైన నేరాలు 40 శాతం తగ్గాయి. గొలుసు చోరీలు 62 శాతం తగ్గగా.. కిడ్నాప్ లు 34 శాతం తగ్ముముఖం పట్టాయి. మహిళలపై నేరాలు కూడా 19 శాతం తగ్గాయి. 2019లో 2354 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది1908 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదిలా ఉంటే మోసాలు మాత్రం భారీగా పెరిగాయి. గత ఏడాది 1393 మోసాలు చోటు చేసుకుంటే.. ఈ ఏడాది డిసెంబరు 19 నాటికే 2456 మోసాలకు సంబంధించిన కేసులు పెరగటం గమనార్హం.